నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
close

తాజా వార్తలు

Updated : 14/07/2020 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో పయనిస్తున్నాయి. ఉదయం 9:41 గంటల సమయంలో సెన్సెక్స్‌ 286 పాయింట్లు నష్టపోయి 36,407 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 79 పాయింట్లు కోల్పోయి 10,723 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.91 వద్ద కొనసాగుతోంది.  కొవిడ్‌ విజృంభణ కొనసాగుతుండడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సూచీలు సైతం నష్టాల్లోకి జారుకున్నాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా నమోదవుతున్నాయి. డోజోన్స్‌ స్వల్ప లాభాలతో ముగియగా.. నాస్‌డాక్‌ కాంపోజిట్‌ 2.13 శాతం కుంగింది. ఇక కరోనా టీకా రాకపోతే వృద్ధి రేటు -7.5 శాతానికి పడిపోతుందన్న అంచనాలు, ఆహార పదార్థాల ధరలు ప్రియం కావడంతో జూన్‌లో రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరగడం, ఐటీ సేవల ఆదాయం 3 శాతం తగ్గొచ్చన్న వార్తలు సూచీలపై ప్రభావం చూపుతున్నాయి. 

హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో లిమిటెడ్‌, భారత్‌ పెట్రోలియం, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్ ల్యాబ్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని