close

తాజా వార్తలు

Updated : 14/07/2020 14:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారీగా పతనమవుతున్న మార్కెట్లు..

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. మధ్యాహ్నం 2.07 సమయంలో సెన్సెక్స్‌ 571పాయింట్లు నష్టపోయి 36,122 వద్ద, నిఫ్టీ 175 పాయింట్లు నష్టపోయి 10,627 వద్ద ట్రేడవుతున్నాయి.  హాత్‌ వే కేబుల్‌, ర్యాలీస్‌ ఇండియా, బయోకాన్‌, ఎఫ్‌.డి.సి తేజస్‌ లాభాల్లో ఉండగా.. ఆర్‌బీఎల్‌, బీహెచ్‌ఈఎల్‌, బంధన్‌ బ్యాంక్‌, మహీంద్రా లాజిస్టిక్స్‌, ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ నష్టాల్లో  కొనసాగుతున్నాయి.  మంగళవారం చాలా కీలకమైన ఆటోమొబైల్‌, ఫైనాన్షియల్‌, లోహ రంగాలకు చెందిన గణాంకాలు  వచ్చాయి.  దీంతో మార్కెట్లు నష్టాల బాటపట్టాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ షేరు 5 శాతం పతనమైంది.  దీంతోపాటు హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు కూడా 2శాతం వరకు తగ్గాయి. మార్కెట్లో అస్థిరతను చూపే విక్స్ సూచీ 6శాతం పెరిగి 26.76గా ఉంది. ముఖ్యంగా మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు విలువ కోల్పోతున్నాయి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని