భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు
close

తాజా వార్తలు

Published : 14/07/2020 16:18 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్ల సూచీలు మంగళవారం భారీగా నష్టపోయాయి. బీఎస్‌ఈ 660 పాయింట్లు నష్టపోయి 36,033 వద్ద, నిఫ్టీ 195 పాయింట్లు కుంగి 10,607 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. హాత్‌వే కేబుల్‌ అండ్‌ డేటా, ఎఫ్‌డీసీ లిమిటెడ్‌, ర్యాలీస్‌ ఇండియా షేర్లు భారీగా లాభపడగా.. బీహెచ్‌ఈఎల్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, జిందాల్‌ స్టెయిన్‌లెస్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. ఒక్క టెలికామ్‌ తప్ప అన్ని రంగాలకు చెందిన సూచీలు కుంగాయి.  సూచీల్లోని ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌షేర్లు 5శాతానికి పైగా పతనం అయ్యాయి. హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు 2శాతానికి పైగా నష్టపోయాయి.  ముఖ్యంగా వాహన రుణాల విషయంలో నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు రావడం, విక్స్‌ సూచీ కూడా పెరగడం ఇన్వెస్టర్లను భయపెట్టింది. 

 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని