close

తాజా వార్తలు

Published : 17/07/2020 01:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దేవుడి దయ కూడా ఉండాలని అన్నాను..

కర్ణాటక ఆరోగ్య మంత్రి కీలక వ్యాఖ్యలు

బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక ఆరోగ్య మంత్రి బి.శ్రీరాములు కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్‌ నుంచి దేవుడే మనల్ని కాపాడాలి అని అన్నారు. అధికార పక్షం, విపక్షం, పేద, ధనిక అనే తేడాలు వైరస్‌కు ఉండవని, అందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

‘‘రాష్ట్రంలో 100 శాతం కేసుల పెరుగుదల ఉంది. రాబోయే రెండు నెలల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం, శాఖల మధ్య సమన్వయ లోపం వల్లనే కేసులు పెరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలన్ని అవాస్తవం. దేవుడొక్కడే మనల్ని కరోనా మహమ్మారి నుంచి కాపాడగలడు’’ అని అన్నారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ‘‘దేవుడు మాత్రమే కరోనా నుంచి కాపాడగలడు అని మంత్రి చేసిన వ్యాఖ్యలు కరోనా కట్టడిలో యడియూరప్ప ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం’’ అని  కర్ణాటక కాంగ్రెస్‌ అధ్యక్షుడు డి.కె. శివకుమార్ విమర్శించారు.

తను చేసిన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో తర్వాత శ్రీరాములు వివరణ ఇచ్చారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రజల సహకారంతోపాటు దేవుడు దయ కూడా ఉండాలని తాను అలా చెప్పినట్లు వెల్లడించారు.  కర్ణాటకలో ఇప్పటి వరకు 47,253 కరోనా కేసులు నమోదయ్యాయి. దాదాపు 928 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల్లో కర్ణాటక నాలుగో స్థానంలో ఉంది. మహారాష్ట్ర 2.75 లక్షల కేసులతో మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు 1.51 లక్షలు, దిల్లీ 1.16 లక్షల కేసులతో రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.