మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌
close

తాజా వార్తలు

Published : 26/02/2020 22:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మార్కెట్లోకి హ్యుందాయ్‌ గ్రాండ్‌ ఐ10 నియోస్‌

దిల్లీ: ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌, ‘గ్రాండ్‌ ఐ10 నియోస్‌’ పెట్రోల్‌ వేరియంట్‌ కారును బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌ 6 ప్రమాణాలతో తయారైన ఈ కారు ప్రారంభ ధర రూ.7.68లక్షలు(ఎక్స్‌ షోరూం)గా కంపెనీ నిర్ణయించింది. 1.0లీటర్‌ టర్బో ఇంజిన్‌తో వినియోగదారుల ముందుకు వస్తున్న ఈ కారు సింగిల్‌ టోన్‌, డ్యుయల్‌ టోన్‌ రెండు వేరియంట్లలో లభిస్తుంది. డ్యుయల్‌ టోన్‌ మోడల్‌ ధర రూ.7.73లక్షలు(ఎక్స్‌ షోరూం)గా సంస్థ నిర్ణయించింది. డ్యుయల్‌ టోన్‌ మోడల్‌ ఫెయిరీ రెడ్‌, బ్లాక్‌ రూఫ్‌, పోరాల్‌ వైట్‌ రంగుల్లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. 

ఈ కారు గరిష్ఠంగా 6,000 ఆర్‌పీఎం సామర్థ్యంతో, 17.5కేజీఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 998 సీసీ ఇంజిన్‌ అమర్చారు. ప్రస్తుతం విడుదలైన రెండు మోడళ్లలోనూ మ్యానువల్‌ గేర్‌ బాక్స్‌ అందిస్తున్నారు. ఈ కారుకు ముందు భాగంలో ప్రొజెక్టర్‌ హెడ్‌ ల్యాంప్స్‌, 15 అంగుళాల డైమండ్‌ అలాయ్‌ వీల్స్‌, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జర్‌, యూఎస్‌బీ ఛార్జింగ్‌ తదితర సదుపాయాల్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా హ్యుందాయ్‌ ఇండియా సేల్స్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్ తరుణ్‌ గార్గ్‌ మాట్లాడుతూ.. గ్రాండ్‌ నియోస్‌ మంచి పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంటుందని చెప్పారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని