ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌.. మొబైల్స్‌పై డిస్కౌంట్స్‌
close

తాజా వార్తలు

Published : 16/02/2020 18:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌.. మొబైల్స్‌పై డిస్కౌంట్స్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ మరో సేల్‌కు సిద్ధమైంది. ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు ‘మొబైల్స్‌ బొనాంజా’ పేరిట సేల్‌ను ప్రకటించింది. ఇందులో మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్‌ అందిస్తోంది. యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ లభించనుంది. మరికొన్ని మొబైల్స్‌ కొనుగోలుపై ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లు అందనున్నాయి. ఐదు రోజుల పాటు సాగే ఈ సేల్‌లో లభించబోయే డిస్కౌంట్లపై ఓ లుక్కేద్దాం..

ముఖ్యంగా ఈ సేల్‌లో శాంసంగ్‌ మొబైల్స్‌పై మంచి డిస్కౌంట్లు లభిస్తున్నాయి. గతేడాది విడుదలైన శాంసంగ్‌ ఏ50 ఫోన్‌ ధర రూ.14,999 కాగా.. సేల్‌ సమయంలో రూ.12,999కే అందించనున్నారు. శాంసంగ్‌ ఎస్‌9 మొబైల్‌ ధర రూ.26,999 ఉండగా.. దీన్ని 22,999కే అందించనున్నారు. ఎస్‌9+ మొబైల్‌ ధర రూ.29,999 కాగా.. 27,999కే సేల్‌లో లభిస్తుంది.

వీటితో పాటు ఐఫోన్‌ ఎక్స్‌ఎస్‌ 64జీబీ వేరియంట్‌ ధర రూ.59,999 కాగా.. సేల్‌ సమయంలో దీన్ని రూ.5 వేలు తక్కువకే విక్రయించనున్నారు. ఆనర్‌ 9ఎక్స్‌ 4జీబీ /128జీబీ వేరియంట్‌ ధర రూ.13,999 కాగా.. రూ.12,999కే అందించనున్నారు. ఒప్పో కే1 రూ.9,990 (ప్రస్తుతం రూ.13,990)కే అందిస్తుండగా.. రియల్‌మీ 5, రియల్‌మీ 3పై రూ.500 వరకు డిస్కౌంట్‌ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్‌ ఎస్‌10 లైట్‌, ఎంఐ ఏ3, రియల్‌మీ ఎక్స్‌టీ ప్రో, ఒప్పో రీనో, వివో జడ్‌ 1ప్రో వంటి మొబైల్స్‌పై ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లు అందిస్తోంది.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని