స్వల్పంగా పెరిగిన ఐఫోన్‌ ధరలు
close

తాజా వార్తలు

Published : 02/03/2020 14:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్వల్పంగా పెరిగిన ఐఫోన్‌ ధరలు

దిల్లీ: భారత్‌లో కొన్ని ఐఫోన్‌ మోడళ్ల ధరల్ని యాపిల్‌ కంపెనీ స్వల్పంగా పెంచింది. బడ్జెట్‌లో దిగుమతి సుంకాన్ని పెంచడంతో ఈ మార్పులు చేయాల్సి వచ్చిందని సంస్థ ప్రకటించింది. ఈ నిర్ణయంతో వివిధ మోడళ్ల ధరలు గరిష్ఠంగా రూ.1300 వరకు పెరగనున్నాయి. తాజా ధరల ప్రకారం ఐఫోన్‌ 11 ప్రో మ్యాక్స్‌ 64 జీబీ వేరియంట్‌ ధర రూ.1,11,200గా, 256 జీబీ వేరియంట్‌ ధర రూ.1,25,200గా ఉండనుంది. ఇదే క్రమంలో ఐఫోన్‌ 11 ప్రో, ఐఫోన్‌ 8 మోడళ్లలోని పలు వేరియంట్ల ధరలు పెరిగాయి. అయితే, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ 11, ఐఫోన్‌ 7, ఐపాడ్‌, యాపిల్‌ వాచ్‌, మ్యాక్‌బుక్‌ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌, ఐఫోన్‌ 7 భారత్‌లోనే అసెంబుల్‌ అవుతున్న కారణంగానే వీటి ధరల్ని పెంచలేదు. ఇక ధరల్లో మార్పు లేని మిగిలిన ఉత్పత్తులు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. ఈ ఏడాది భారత్‌లో ఆన్‌లైన్‌ స్టోర్‌, వచ్చే ఏడాది ‘బ్రిక్‌ అండ్‌ మోర్టార్‌ స్టోర్‌’ ప్రారంభించనున్నామని యాపిల్‌ సీఈఓ టిమ్ కుక్‌ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని