
తాజా వార్తలు
ఎయిర్టెల్ నుంచి మరో రెండు కొత్త ప్లాన్లు!
దిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు మరో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. రూ.279, రూ.379 ధరలతో ఈ ప్లాన్లను వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు సంస్థ తమ వెబ్సైట్లో ఉంచింది. సంస్థ వెబ్సైట్లో ఈ రెండు ప్లాన్లకు మధ్య అన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ సర్వీస్‌లలో సంస్థ కొన్ని తేడాలను పేర్కొంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రూ.279తో రీచార్జ్ చేసుకోవడం ద్వారా సొంత నెట్వర్క్ సహా ఇతర వాటికి కూడా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. దాంతోపాటు ప్రతిరోజూ 1.5జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చని పేర్కొంది. ఈ ప్లాన్‌కు 28 రోజుల గడువు ఉంటుందని సైట్లో వెల్లడించింది. అంతేకాకుండా ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకోవడం ద్వారా ఎయిర్టెల్ రూ.4లక్షల హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్సు సదుపాయాన్ని కల్పిస్తోంది.
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రూ.379 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ ద్వారా ఇతర నెట్‌వర్క్‌లకు అన్లిమిటెడ్ కాల్స్ సౌకర్యాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్‌లో కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్లు ఇస్తున్నట్లు సంస్థ సైట్లో పేర్కొంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో ఫాస్టాగ్ కొనుగోలుపై ఎయిర్టెల్ వినియోగదారులకు రూ.100 క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. అదనంగా షా అకాడమీ నుంచి నాలుగు వారాల మ్యూజిక్ కోర్సును ఉచితంగా అందించడంతో పాటు.. వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రైమ్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లను ఇస్తోంది.
ఎయిర్టెల్ ఇటీవల తమ రూ.558 ప్లాన్ వ్యాలిడిటీపై భారీగా కోత విధించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్‌పై 26 రోజులు గడువు కుదిస్తూ ప్రకటించింది. దాంతో పాటు మినిమం మంత్లీ రీచార్జ్‌ను(ఎంఎంఆర్) సైతం రూ.35 నుంచి రూ.45కు పెంచుతున్నట్లు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఈ రెండు ప్లాన్లకు సంబంధించిన విషయాలను సైట్లో ఉంచింది.