Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (04/02/2020)
close

తాజా వార్తలు

Updated : 05/02/2020 19:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (04/02/2020)

1. బ్లాక్‌ బెర్రీ ఫోన్లు ఇక రావా?

స్మార్ట్‌ఫోన్స్‌లో బ్లాక్‌బెర్రీకి ఉన్న ప్రత్యేకతే వేరు. టచ్‌, ఫిజికల్‌ కీబోర్డుతో బ్లాక్‌ బెర్రీ తీసుకొచ్చే మొబైల్స్‌ అంటే కొందరు ఆసక్తి చూపుతుంటారు. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే త్వరలో బ్లాక్‌బెర్రీ మొబైల్స్‌ ఆగిపోతాయేమో అనిపిస్తోంది. మన దేశంలో బ్లాక్‌బెర్రీ, టీసీఎల్‌ కమ్యూనికేషన్స్‌ కలసి మొబైల్స్‌ తీసుకొస్తున్నాయి. అయితే ఆగస్టు 31 నాటికి బ్లాక్‌బెర్రీ బ్రాండెడ్‌ మొబైళ్ల అమ్మకాల్ని నిలిపేస్తున్నట్లు టీసీఎల్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో మరి బ్లాక్‌బెర్రీ ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటుందనే విషయంలో స్పష్టత రావడం లేదు. కొందరైతే ఇక బ్లాక్‌బెర్రీ మొబైళ్లు మన దేశానికి రావని అంటున్నారు. 

2. రెడ్‌మీ కె30 ప్రో సంగతి ఇదీ...

రెడ్‌మీ కె30లో కొన్ని మార్పులు చేసి మన దేశంలో పోకో ఎక్స్‌2 గా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజే రెడ్‌మీ కె30 ప్రో గురించి కొన్ని వివరాలు బయటికొచ్చాయి. ప్రో వెర్షన్‌లోనూ వెనుకవైపు నాలుగు కెమెరాలను కొనసాగిస్తారట. కొత్తతరం ప్రోసెసర్‌ స్నాప్‌డ్రాగన్‌ 865 ప్రాసెసర్‌ ఉండబోతోందని తెలుస్తోంది. 8 జీబీ ర్యామ్‌ ఉంటుంది. ఇందులో ప్రధాన కెమెరాగా సోనీ ఐఎంఎక్స్‌ 686 సెన్సర్‌ను వినియోగిస్తున్నారు. ఈ మొబైల్‌ను కూడా 4జీ, 5జీ మోడళ్లలో తీసుకొస్తారని తెలుస్తోంది. 

3. కొత్త ఐఫోన్‌ డిజైన్‌ ఇదీ...

కొత్త ఐఫోన్స్‌ కోసం యాపిల్‌ కసరత్తు మొదలుపెట్టిందట. కొత్త సిరీస్‌ మొబైళ్లకు సంబంధించిన డిజైన్లు ఇప్పుడు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఏడాది కూడా యాపిల్‌ నుంచి ఐఫోన్‌12 సిరీస్‌లో మూడు మొబైల్స్‌ రాబోతున్నాయట. వీటికి సంబంధించిన హ్యాండ్స్‌ఆన్‌ వీడియో ఒకటి బయటికొచ్చింది. కొత్త మొబైల్స్‌కు ఐఫోన్‌ 12, ఐఫోన్‌ 12 ప్రో, ఐఫోన్‌ 12 ప్రో మ్యాక్స్‌ అని పేర్లు పెడుతున్నారట. వీడియో ప్రకారం చూస్తే ఐఫోన్‌ 11కు దగ్గరగానే ఐఫోన్‌ 12 ఉండనున్నాయి.

4. ఇన్‌స్టాగ్రామ్‌కు దగ్గరగా...

ప్రస్తుతం యువతకు ఏ మాత్రం సమయం చిక్కినా టిక్‌ టాక్‌ యాప్‌ ఓపెన్‌ చేసేస్తున్నారు. అందుకే టిక్‌ టాక్‌ కూడా ఎప్పటికప్పుడు డిజైన్‌, ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తూ పోతోంది. అయితే తాజా డిజైన్‌ చూస్తుంటే టిక్‌ టాక్‌... ఇన్‌స్టాగ్రామ్‌ స్టైల్‌లోకి వెళ్లిపోతున్నట్లు అనిపిస్తోంది. ఓవైపు టిక్‌టాక్‌కు పోటీగా ఇన్‌స్టాగ్రామ్‌ ‘రీల్స్‌’ యాప్‌ తీసుకొస్తుంటే.. మరోవైపు టిక్‌టాక్‌ ఇన్‌స్టా యూజర్‌ ఇంటర్ఫేస్‌ను ఫాలో అవుతోంది. 

5. ఇంటికొచ్చి రిపేర్‌ చేసిస్తారు

ఫోన్‌ స్క్రీన్‌ పగిలినా, ఏదైనా సమస్య వస్తే... సర్వీసు సెంటర్‌ వరకు వెళ్లి రిపేర్‌ చేయించుకోవాలి. కొన్ని సంస్థలు పికప్‌ సర్వీసులను అందిస్తున్నాయి. ఇప్పుడు యాపిల్‌ మరో ప్రయోగం చేయబోతోంది. మీ ఇంటి దగ్గరకి వచ్చి మొబైల్‌ రిపేర్‌ చేసేలా ఏర్పాట్లు చేసిందని సమాచారం. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీసు శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ ఏంజిల్స్‌‌, న్యూయార్క్‌, షికాగో, హూస్టన్‌, డాలస్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. మిగిలిన ప్రాంతాల గురించి స్పష్టత రావాల్సి ఉంది.

6. రియల్‌మీ టీవీ వస్తోందోచ్‌

బడ్జెట్‌ మొబైల్స్‌లో జోరు చూపిస్తున్న రియల్‌మీ టీవీల విభాగంలోకి కూడా రాబోతోంది.  ఈనెలాఖరున జరగబోయే మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌లో రియల్‌మీ టీవీని పరిచయం చేయనున్నారు.  ఈ మేరకు రియల్‌మీ సీఎంవో ఫ్రాన్సిస్‌ వాంగ్‌ ట్విటర్‌లో ఓ నెటిజన్‌కు సమాధానమిచ్చారు. ఇప్పటికే మొబైల్స్‌లో దూసుకుపోతున్న షావోమీ, వన్‌ప్లస్‌, నోకియా లాంటి సంస్థలు టీవీల్లోకి వచ్చాయి. ఇప్పుడు రియల్‌మీ కూడా అదేపనిలో ఉందన్నమాట.

7. జీ-మెయిల్‌లో డార్క్‌ మోడ్‌ పోయిందా?

జీ-మెయిల్‌ యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న డార్క్‌మోడ్‌ ఇటీవల అందుబాటులోకి వచ్చింది. అయితే కొంతమంది యూజర్లకు డార్క్‌ మోడ్‌ డిజేబుల్‌ అయిపోయింది.  జీమెయిల్‌ యాప్‌ సెట్టింగ్స్‌లో జనరల్‌ సెట్టింగ్స్‌లో థీమ్‌ మార్చుకోవడానికి ఆప్షన్‌ ఉంటుంది. కానీ కొందరికి ఈ ఆప్షన్‌ కనిపించడం లేదు. అలాంటివాళ్ల మొబైల్స్‌లో డార్క్‌ మోడ్‌ పని చేయడం లేదని నెటిజన్లు గూగుల్‌ని ఉద్దేశించి ట్వీట్‌ చేస్తున్నారు. మరి దీనికి గూగుల్‌ ఏం చెబుతుందో చూడాలి. అయితే యాప్‌ను ఫోర్స్‌ స్టాప్‌ చేస్తే డార్క్‌ మోడ్‌ తిరిగి వస్తోందని చెబుతున్నారు.

8. ఈ స్మార్ట్‌వాచ్‌.. స్మార్ట్‌ ఫోన్‌కేం తక్కువ కాదు

లీహుర్‌ వీ8... ఈ స్మార్ట్‌వాచ్‌ ధర సుమారు ₹700 (9 డాలర్లు). ధరలోనే అదుర్స్‌ అనిపిస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌.. స్మార్ట్‌ఫోన్‌కి ఏ మాత్రం తక్కువ కాదు. ఎందుకంటారా ఇందులో సిమ్‌ వేసుకోవచ్చు.. కాల్స్‌ చేసుకోవచ్చు కూడా. అవును ఈ స్మార్ట్‌వాచ్‌ని కాల్స్‌ చేసుకునే ఫోన్‌లా వాడుకోవచ్చు. గేర్‌బెస్ట్‌ లాంటి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.  ఇందులో కెమెరా, బ్రౌజర్‌ కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇందులో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ లాంటి యాప్స్‌ కూడా వాడొచ్చు. 

9. గూగుల్‌ సెర్చ్‌లో రీఛార్జిలు

గూగుల్‌ సెర్చ్‌లో మరో కీలకమై ఫీచర్‌ రాబోతోంది. మొబైల్‌ ఫోన్స్‌ రీఛార్జి చేయాలంటే ఇకపై వేర్వేరు యాప్‌లు వాడనక్కర్లేదు. గూగుల్‌ సెర్చ్‌లోనే ఈ ఆప్షన్‌ రాబోతోంది. గూగుల్‌ సెర్చ్‌లో రీఛార్జి అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేస్తే మీకు ‘మొబైల్‌ రీఛార్జ్‌’ అని ఓ బాక్స్‌ వస్తుంది. అందులో మొబైల్‌ నెంబరు ఇచ్చి... కావాల్సిన ప్లాన్‌ సెలక్ట్‌ చేసి రీఛార్జి చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్‌ కొంతమంది యూజర్లకు బీటా వెర్షన్‌ రూపంలో అందుబాటులోకి వచ్చిందట. త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. 

10. మూడు కోట్ల ఐఫోన్‌ ఎస్‌ఈ2లు..

యాపిల్‌ ఫోన్స్‌ యూజర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్‌ ఎస్‌ఈ2 వచ్చే నెలలో రాబోతోందనే విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్‌ ప్రభావం కారణంగా ఎస్‌ఈ2 ఆలస్యమవుతోందని వార్తలొచ్చాయి. కానీ ఈ ఫోన్‌ తయారీ ప్రక్రియకు సంబంధించిన ట్రయల్‌ మొదలైందట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఈ మొబైల్‌ అందుబాటులోకి వస్తుందట. ఏడాదిలో మూడు కోట్ల ఎస్‌ఈ2 అమ్మకాలే లక్ష్యంగా యాపిల్‌ ప్రొడక్షన్‌ చేస్తోందట. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని