Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (06/02/2020)
close

తాజా వార్తలు

Published : 09/02/2020 10:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tech10: నేటి గ్యాడ్జెట్‌ & టెక్‌ కబుర్లు (06/02/2020)

1. కెమెరాలు మూసేయొచ్చు

వన్‌ప్లస్‌ ఇటీవల కాన్సెప్ట్‌ ఫోన్‌ పేరుతో డిస్‌అపియరింగ్‌ కెమెరా ఉన్న మొబైల్‌ని తీసుకొచ్చింది. కెమెరా యాప్‌ను ఓపెన్‌ చేసినప్పుడు మాత్రమే వెనుకవైపు కెమెరా సెన్సర్లు కనిపిస్తాయి. ఇప్పుడు ఆ కంపెనీ మరో కొత్త రకం కెమెరా సెటప్‌ను సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన పేటెంట్‌ కోసం వన్‌ప్లస్‌ ఫైల్‌ చేసింది. దాని ప్రకారం చూస్తే.. కొత్త సెటప్‌లో వెనుకవైపు సర్కిల్‌లో కెమెరాలు ఉంటాయి. సాధారణ సమయంలో చూస్తే సెన్సర్లు మూసుకుపోయి ఉంటాయి. కెమెరా ఆన్‌ చేస్తే సర్కిల్‌లోని రింగ్‌ రోల్‌ అయ్యి కెమెరాలు కనిపిస్తాయి. ముందువైపు కెమెరా సెన్సరే కనిపించడం లేదు. దీనిబట్టి ఇన్‌డిస్‌ప్లే కెమెరా ఉండబోతోందని తెలుస్తోంది. 


2. రెడ్‌మీ కొత్త మొబైల్‌ వస్తోంది

రెడ్‌మీ నుంచి కొత్త బడ్జెట్‌ మొబైల్‌ మార్కెట్‌లోకి రాబోతోంది. రెడ్‌మీ 8ఏకు కొనసాగింపుగా ఈ నెల 11న రెడ్‌మీ 9ఏ తీసుకొస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన టీజర్లను సంస్థ విడుదల చేసింది. ఈ మొబైల్‌కు ‘దేశ్‌ కా దమ్‌దార్‌ స్మార్ట్‌ఫోన్‌’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టారు. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ70 చిప్‌సెట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారని తెలుస్తోంది. దీంతోపాటు రెడ్‌మీ పవర్‌ బ్యాంకు కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తారని సమాచారం. ఈ పవర్‌ బ్యాంకు 27 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుందని భోగట్టా.


3. ఈ ఐఫోన్‌ ధర ₹11 లక్షలపై మాటే...

ప్రీమియం ఐఫోన్లను తయారు చేసే కేవియర్‌ సంస్థ మరో భారీ ఐఫోన్‌ను తీసుకొచ్చింది. టెస్లా సైబర్‌ ట్రక్‌ డిజైన్‌తో ఐఫోన్‌ 11 ప్రో మొబైల్‌ను రూపొందించింది. టైటానియంతో రూపొందించిన ఈ మొబైల్‌ ధర ₹11.3లక్షలు. మొబైల్‌ను డిస్‌ప్లేను కటౌట్‌ స్టైల్‌లో టైటానియంతోనే రూపొందించారు. దీని వల్ల మొబైల్‌ కిందపడిపోయినా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నట్లు ఈ మొబైల్‌ను సైబర్‌ ఫోన్‌ అని పిలుస్తున్నారు. కేవలం 99 మొబైళ్లను మాత్రమే రూపొందించినట్లు తెలుస్తోంది. మన దేశానికి ఈ మొబైల్‌ తీసుకొచ్చే అవకాశం లేదని సమాచారం. 


4. అథ్లెట్ల కోసం కొత్త ‘రిస్ట్‌ వాచ్‌’

అథ్లెట్ల కోసం శాస్త్రవేత్తలు కొత్త పరికరాన్ని రూపొందించారు. రిస్ట్‌ వాచ్‌లా ఉండే దీంతో ఆటగాళ్ల ప్రదర్శన మెరుగవుతుందని ఉత్తర కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు గుర్తించడంలో ఈ పరికరం బాగా ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. క్రీడాకారుడి శరీరంపైన వచ్చే చెమటను శోధించేలా ఈ డివైజ్‌కు సెన్సర్లు ఉండే స్ట్రిప్‌ ఉంటుంది. క్రీడాకారుడి మెటబోలైజ్‌ లెవల్స్‌ నిర్ణీత పరిమాణం కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ డివైజ్‌ ట్రైనర్లకు తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ డివైజ్‌ ఇంకా ప్రయోగదశలో ఉంది.


5. పోకెమన్‌లో ఏ జీవి అంటే ఇష్టం?

పోకెమన్‌.. యువతను ఓ ఊపు ఊపేసిన ఆట. పిల్లలు, యువత మొబైల్స్‌ పట్టుకొని రోడ్డెక్కి విచిత్ర జీవును వేటాడుతూ తిరిగారు. ఇప్పుడు పోకెమన్‌ గేమ్‌లో సుమారు వెయ్యి జీవులు ఉన్నాయి. వీటికి బాగా నచ్చింది ఏది అంటూ గూగుల్‌ సహకారంతో పోకెమన్‌ ఓ పోల్‌ నిర్వహిస్తోంది. ‘పోకోమన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోల్‌ ఫిబ్రవరి 14 వరకు కొనసాగుతుంది. ఇందులో రోజుకో ఓటు వేయొచ్చు. మీరూ ఓటేస్తా అంటే... ఈ లింక్‌లోకి వెళ్లండి.


6. నోకియా ఫోన్లకూ జియో వోవైఫై

నెట్‌వర్క్‌ సమస్యలు ఉన్నప్పుడు ఉపయుక్తంగా ఉండేలా మొబైల్‌ సంస్థలు వోవైఫై ఫీచర్‌ను తీసుకొస్తున్నాయి. అలా జియో నుంచి ఇటీవల వోవైఫై ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ సమయంలో కొన్ని మొబైల్స్‌కు మాత్రమే ఈ ఫీచర్‌ సపోర్టు చేసింది. తాజాగా నోకియా మొబైల్స్‌లో కూడా ఈ ఆప్షన్‌ పని చేస్తోంది. దీనికి సంబంధించి నోకియా ఓఎస్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. నోకియా 8.1, నోకియా 7 ప్లస్‌, నోకియా 7.1, నోకియా 6.1 ప్లస్‌ మోడల్స్‌ వోవైఫై ఫీచర్‌ను సపోర్టు చేస్తున్నాయి.


7. వాట్సాప్‌లో కొత్త బగ్‌

సోషల్‌ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో పరిశోధకులు కొత్త బగ్‌ను కనుగొన్నారు. జావా స్క్రిప్ట్‌లో ఉన్న బగ్‌ కారణంగా ఈ సమస్య వస్తోందని చెప్పారు. వాట్సాప్‌ డెస్క్‌టాప్‌ వాడే యూజర్లు, ఐఫోన్‌ యూజర్లే లక్ష్యంగా అగంతుకులు ఈ పని చేస్తున్నారట. సాధారణంగా వచ్చే నోటిఫికేషన్లలానే ఇవీ ఉంటాయి. క్లిక్‌ చేస్తే ఎంప్టీ వస్తుంది. కానీ అందులో మాల్‌వేర్‌ మీ సిస్టమ్‌లో చేరిపోతుందని పరిశోధకులు చెబుతున్నారు. డెస్క్‌టాప్‌ వెర్షన్‌ 0.3.9309, ఐఓఎస్‌ వెర్షన్‌ 2.20.10 కంటే ముందు ఉన్న డెస్క్‌టాప్‌ యాప్‌లో ఈ సమస్య ఉందట. అప్‌డేటెడ్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ వాడనివాళ్లలోనూ ఈ సమస్య ఉందట. కాబట్టి వెంటనే యాప్‌, బ్రౌజర్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని పరిశీలకులు సూచిస్తున్నారు.


8. వివో వీ19 వచ్చేది వచ్చే నెలలోనే...

వివో నుంచి కొత్త మొబైల్‌ రావడానికి రంగం సిద్ధమైపోయింది. సరికొత్త వివో వీ19 సిరీస్‌ మోడల్‌ను వచ్చే నెల మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నారని సమాచారం. మామూలుగా అయితే వివో నుంచి తొలుత వీ19 వచ్చి.. తర్వాత వీ19 ప్రో రావాలి. కానీ ఈ సారి వీ19 ప్రోను ముందుగా తీసుకొస్తారని తెలుస్తోంది. ఇందులో డ్యూయల్‌ పంచ్‌హోల్‌ డిస్‌ప్లే ఉండబోతోంది. దీంతోపాటు సెల్ఫీ ఫొటోల్లో కొత్తదనం కోసం అల్ట్రావైడ్‌ సెల్ఫీ కెమెరాను తీసుకొస్తున్నారని తెలుస్తోంది. ఈ నెలాఖరున ప్రీ బుకింగ్స్‌ మొదలయ్యే అవకాశముందని సమాచారం.


9. 8 అంగుళాల అమెజాన్‌ ఎకో షో

అమెజాన్‌ తన స్మార్ట్‌ హోమ్‌ డివైజ్‌లతో భారత్‌కు వరుస కడుతోంది. తాజాగా ఎకో షో 8 పేరుతో మరో డివైజ్‌ను మన మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గతేడాది సెప్టెంబరులో ప్రపంచ మార్కెట్‌లో ఈ డివైజ్‌ను లాంచ్‌ చేసిన విషయం తెలిసిందే. దీని ధర ₹12,999. ప్రీ ఆర్డర్‌లో కొనుగోలు చేసేవారికి ₹8,999కే లభ్యమవుతుంది. ఇందులో 8 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్‌ ఉంటుంది. మేలైన వాయిస్‌ రికగ్నిషన్‌ కోసం ఇందులో నాలుగు మైక్రోఫోన్‌లు ఇస్తున్నారు. ఇందులోని కెమెరాను స్కైప్‌, అలెక్సాతో ఇంటిగ్రేట్‌ చేసుకోవచ్చు.


10. TIP‌: ఐఫోన్‌లో ర్యామ్‌ క్లియర్‌ 

మీ ఐఫోన్‌ స్లోగా ఉన్నట్లు అనిపిస్తోందా? అయితే ర్యామ్‌ క్లియర్‌ చేయండి. ఐఫోన్‌లో ర్యామ్‌ క్లియర్‌ చేయడమెలా అనుకుంటున్నారా? దీనికీ ఓ ఆప్షన్‌ ఉందంటున్నారు టెక్‌ నిపుణులు. టచ్‌ ఐడీ ఉన్న మొబైల్స్‌లో ఈ ఆప్షన్‌ పని చేస్తుందట. దీనికి చేయాల్సిందల్లా.. మొబైల్‌లో సెట్టింగ్స్‌ ఓపెన్‌ చేసి జనరల్‌లోకి వెళ్లాలి. అక్కడ షట్‌డౌన్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత హోమ్‌ బటన్‌ను ఓ ఐదు సెకన్ల పాటు ప్రెస్‌ చేయాలి. అప్పుడు మీ ఫోన్‌ హోమ్‌ స్క్రీన్‌/లాక్‌ స్క్రీన్‌కు వచ్చేస్తుంది. అంటే మీ ఫోన్‌ ర్యామ్‌ క్లియర్‌ అయినట్లే. మీరూ ఓసారి ట్రై చేయండి మరి.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని