
తాజా వార్తలు
రాజమౌళి నెక్ట్స్ మహేశ్‌తోనే.. ఇది ఫిక్స్..!
వెల్లడించిన దర్శకధీరుడు
హైదరాబాద్: దర్శకధీరుడు రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కాంబినేషన్లో ఓ సినిమా వస్తే చూడాలని సినీ ప్రియులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తాను మహేశ్‌బాబుతో తప్పకుండా ఓ సినిమా చేస్తానని ఇప్పటికే రాజమౌళి చాలా ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి ప్రభాస్‌తో సినిమా చేయనున్నారంటూ గత కొన్ని రోజుల క్రితం సోషల్‌మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజమౌళిని ఓ తెలుగు ఛానెల్‌వారు ఇంటర్వ్యూ చేయగా.. ఆయన తన తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత ఆయన మహేశ్‌బాబుతోనే సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారని ఆయన వెల్లడించారు. సాధారణంగా రాజమౌళి.. ఒక సినిమా చేస్తున్నప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎప్పుడూ బయటపడలేదు. కానీ ‘ఆర్ఆర్ఆర్’ చేస్తుండగానే మహేశ్ ప్రాజెక్ట్ గురించి ప్రకటించడంతో ఆయన అభిమానులతోపాటు సినీ ప్రియులు సైతం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేశ్‌బాబుకు సెట్ అయ్యే విధంగా తన దగ్గర ఓ మంచి స్టోరీ లైన్ ఉందని, దానిని డెవలప్ చేస్తున్నానని ఒకానొక సందర్భంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తెలిపిన విషయం విదితమే.
ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టులో బిజీగా ఉన్నారు. రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు కథానాయకులుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత రాజమౌళి-మహేశ్ కాంబోలో సినిమా ఉంటుంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- కన్నీటి పర్యంతమైన మోదీ
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
