‘బంగారు బుల్లోడు’ టీజర్‌ నవ్వులే నవ్వులు
close

తాజా వార్తలు

Published : 01/07/2020 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘బంగారు బుల్లోడు’ టీజర్‌ నవ్వులే నవ్వులు

హైదరాబాద్‌: తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే కథానాయకుడు అల్లరి నరేష్‌. ఆయన హీరోగా పీవీ గిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగారు బుల్లోడు’. పుజా ఝవేరి కథానాయిక. మంగళవారం అల్లరి నరేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. హాస్య ప్రధాన చిత్రాలకు పెట్టింది పేరైన అల్లరి నరేష్ మరోసారి తన కామెడీ టైమింగ్‌ అలరించారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సాయి కార్తీక్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిషోర్‌, సత్యం రాజేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 



Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని