close

తాజా వార్తలు

Updated : 03/03/2020 10:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పట్టువదలని ‘విక్రమా’ర్కుడు.. దేనికైనా రెడీ!

పాత్ర కోసం ప్రాణాలు పెట్టే కథానాయకుడాయన. ఎంత కష్టమైనా.. ఎంత నష్టపోయినా అనుకున్నది సాధించేంత వరకూ నిద్రపోడు. సినిమా ఫలితం పక్కనపెట్టి.. సరికొత్త ప్రయోగంతో ప్రత్యేకంగా నిలవాలనుకుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే అతడో పట్టువదలని ‘విక్రమా’ర్కుడు.. అందుకేనేమో అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్ అయినా.. స్టేజ్‌ నేమ్‌ విక్రమ్‌ అని పెట్టుకున్నారు. ఇప్పుడు అర్థమైందా ఇదంతా మన ‘అపరిచితుడు’ గురించేనని. ఆయన ఏడు పాత్రల్లో నటిస్తున్న ‘కోబ్రా’ సినిమా త్వరలో ప్రేక్షకుల రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మరోసారి ఆయన సాహసం చేస్తున్నారని విమర్శకులు, అభిమానులు మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా విక్రమ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయిన పాత్రల్ని చూద్దాం..

ప్రయోగాలకు ‘సేతు’

అందమైన కాలేజీ కుర్రాడు ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తపిస్తాడు. ఇలాంటి పాత్ర ఎవరైనా చేస్తారు. మరి ఆ ప్రేమికుడు ప్రేయసి దక్కలేదని పిచ్చివాడై, అంద విహీనంగా తయారైతే..? ఆ చిత్ర కథ విషాదంతో ముగిస్తే..?.. ఇలాంటి కథను చేయడానికి ఏ నటుడైనా సంకోచిస్తారు. కానీ, విక్రమ్‌ దీన్ని సవాలుగా స్వీకరించారు. ‘సేతు’ (తెలుగులో ‘శేషు’గా రీమేక్‌ అయ్యింది) సినిమాలో నటించి హిట్టు అందుకున్నారు. అంతేకాదు పాత్ర కోసం దేనికైనా రెడీ అని నిరూపించారు. అందుకే ఈ సినిమాకు తమిళనాడు రాష్ట్ర అవార్డు అందుకున్నారు.

నటనలో శివపుత్రుడు

విక్రమ్‌ తన కెరీర్‌లో ‘శివపుత్రుడు’తో మరోసారి మెప్పించారు. లోకజ్ఞానం తెలియని కుర్రాడిగా, అమాయకంగా కనిపించారు. ఆయనతోపాటు సూర్య, సంగీత, లైలా ప్రధాన పాత్రలు పోషింంచిన ఈ సినిమాకు బాలా దర్శకత్వం వహించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. కన్నడలో రీమేక్‌ చేశారు. ఈ సినిమాలో నటనకు గానూ విక్రమ్‌  ఉత్తమనటుడిగా జాతీయ అవార్డుని అందుకున్నారు. 

అపరిచితుడు.. ప్రేక్షకులను అయ్యాడు సుపరిచితుడు

2005లో విక్రమ్‌ కెరీర్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ‘అపరిచితుడు’లో ఆయన పోషించిన మూడు వైవిధ్యమైన పాత్రలు ఆశ్చర్యపరిచాయి. రామానుజం, రెమో, అపరిచితుడిగా ఆయన నటన నభూతో.. ముఖ్యంగా జైలులో ప్రకాశ్‌రాజ్‌, విక్రమ్‌ మధ్య వచ్చే సన్నివేశం.. ఒకే సమయంలో మూడు పాత్రల మధ్య వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ నటించిన తీరు హైలైట్‌గా నిలిచాయి. శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సదా కథానాయిక . 2005లో వచ్చిన  ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విశేషమైన వసూళ్లను రాబట్టింది. 

మల్లన్న.. గెటప్‌లతో చంపేశాడన్నా!

క్రమార్కులు కూడబెట్టిన సంపదను దోచి, దేవుడి పేరుతో పేదలకు డబ్బు పంచే ఇతివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘మల్లన’. సీబీఐ ఆఫీసర్‌గా పనిచేస్తూ వివిధ వేషాల్లో విక్రమ్‌ నటన అలరిస్తుంది. కోడిగా, మహిళగా, వృద్ధుడిగా వివిధ గెటప్‌ల్లో కనిపిస్తారు విక్రమ్‌. శ్రియ కథానాయికగా నటించిన ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించారు.

‘ఐ’ కోసం అంతకుమించి..

‘అపరిచితుడు’ తర్వాత విక్రమ్‌-శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘ఐ’. ఈ సినిమా కోసం మిస్టర్‌ ఆంధ్రాగా, మరోపక్క కురూపిగా నటించారు. మిస్టర్‌ ఆంధ్రా గెటప్‌ కోసం సిక్స్‌ప్యాక్‌లో దర్శనమిచ్చిన విక్రమ్‌.. కురూపి పాత్ర కోసం కష్టపడి చాలా బరువు తగ్గారు. ఆహార నియమాలు పాటించి సన్నగా అయిపోయారు. ఈ సమయంలో ఆయన ఆరోగ్యం కూడా చాలా క్షీణించింది. వైద్యులు హెచ్చరించినప్పటికీ లెక్కచేయని మొండితనం ఆయనది. అయితే, విక్రమ్‌ కష్టానికి సరైన ఫలితం దక్కలేదు. 

‘ఇంకొక్కడు’.. కానీ సినిమాలో ఇద్దరు

చిత్ర పరిశ్రమలో ఫాంలో ఉన్న కథానాయకుడు ట్రాన్‌జెండర్‌ పాత్రను పోషించడమంటే ఆషామాషీ కాదు. తేడా వస్తే.. అభిమానులు నిరాశ చెందుతారు. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ విక్రమ్‌ దీన్ని కూడా ఛాలెంజ్‌గా తీసుకుని ‘ఇరుముగన్‌’ (తెలుగులో ‘ఇంకొక్కడు’)లో నటించారు. ‘రా’ ఏజెంట్‌గా, ‘లవ్‌’గా మెప్పించారు. ‘లవ్‌’ పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నారు. ఆయన హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను ఆనంద్‌ శంకర్‌ తెరకెక్కించారు.

ఏడు గెటప్‌ల్లో కోబ్రా

విక్రమ్‌ సరికొత్త ప్రయోగం ‘కోబ్రా’. ఇందులో ఆయన ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏడు గెటప్‌లలో కనిపించబోతున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ వచ్చింది. ఒక్క పాత్ర లుక్‌కు, మరోపాత్ర లుక్‌కు ఏ మాత్రం సంబంధం లేదు కదా.. కొన్ని గెటప్‌లు చూస్తే అక్కడున్నది విక్రమేనా అని ఆశ్చర్యపోయేలా ఉన్నాయి. తొలి ప్రచార చిత్రం అంచనాల్ని పెంచింది. మరి ఈ సినిమాతో ఆయన ఎలా అలరించబోతున్నారో తెలియాలంటే వేచి చూడాలి.

-ఇంటర్నెట్‌డెస్క్‌, ప్రత్యేకం

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.