సహనటుడి కోసం కదిలొచ్చిన సేతుపతి
close

తాజా వార్తలు

Updated : 13/03/2020 14:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సహనటుడి కోసం కదిలొచ్చిన సేతుపతి

చెన్నై(తమిళనాడు): విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి 96 సినిమాతో దక్షిణాదిన మంచి పేరు తెచ్చుకున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకున్నాడు. అటు కోలివుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ సినీ అభిమానులను అలరిస్తున్నాడు. అయితే, తాను రీల్‌లోనే కాదు.. రియల్‌ లైఫ్‌లోనూ తాను హీరోనే అని నిరూపించుకున్నాడు.
ఒకప్పుడు తనతో కలిసి పనిచేసిన నటుడు, యాంకర్‌ లోకేశ్‌ ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరాడు చికిత్స పొందుతుండగా పక్షవాతం వచ్చింది. అతని కుటుంబం వైద్య ఖర్చులు భరించలేని పరిస్థితిలో ఉందన్న విషయం తెలుసుకున్న విజయ్‌ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించాడు. అంతేకాదు ఆసుపత్రి ఖర్చులు కూడా భరిస్తానని ఆ కుటుంబానికి హామీ ఇచ్చాడు. సేతుపతి హీరోగా నటించిన ‘నేను రౌడీనే’లో లోకేశ్‌ చిన్న పాత్ర పోషించాడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో తీరికలేకుండా ఉన్నప్పటికి లోకేశ్‌ను పరామర్శించడంతో సర్వత్రా విజయ్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో ఈ హీరో ‘ఉప్పెన’తో పాటు అల్లుఅర్జున్, సుకుమార్‌ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని