close

తాజా వార్తలు

Published : 22/03/2020 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నటుడు రాజశేఖర్‌ దాతృత్వం

హైదరాబాద్‌: ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ వల్ల ప్రభుత్వం, చిత్ర పరిశ్రమ తీసుకున్న నిర్ణయం కారణంగా షూటింగ్‌లు ఆగిపోయిన సంగతి తెలిసిందే. దీని వల్ల ఆ రోజు పని చేస్తే కానీ ఇల్లు గడవని నిరుపేద కళాకారులు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అలాంటి కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయబోతున్నట్లు సీనియర్ నటుడు రాజశేఖర్‌ దంపతులు తెలిపారు.

రాజశేఖర్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తమ బాధ్యతగా సరకులు అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కళాకారులు 90108 10140 నెంబర్‌కు సంప్రదించాలని, పూర్తి వివరాలు అందించి సహాయం పొందాలని కోరారు. కరోనా కారణంగా షూటింగ్‌లే కాకుండా సినిమా విడుదల తేదీలు కూడా వాయిదాపడ్డ సంగతి తెలిసిందే.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని