close

తాజా వార్తలు

Published : 05/04/2020 13:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చిరు సంస్థకు రాజశేఖర్‌ కుమార్తెల విరాళం

ఈ కష్టాలుపోయే వరకూ సాయం చేస్తాం: రాజశేఖర్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన సినీ కార్మికుల సంక్షేమం కోసం ‘కరోనా క్రైసీస్‌ ఛారిటీ’ పేరుతో చిరంజీవి ఓ సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ద్వారా సినీ కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు సీసీసీ కోసం తమవంతు విరాళాలను అందజేయగా తాజాగా నటుడు రాజశేఖర్‌ కుమార్తెలు శివానీ, శివాత్మిక తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు వారిద్దరూ కలిసి తమ సొంత సంపాదన నుంచి రూ.2 లక్షలను ఇవ్వనున్నట్లు తెలియజేశారు.

ఈ విషయంపై రాజశేఖర్‌ స్పందిస్తూ.. ‘కరోనా కష్టాలు ప్రారంభమైన నాటి నుంచి టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందిన సినీ కార్మికులు, వలస కూలీలు, ఇల్లులేని పేదవారి కోసం నేను, జీవిత ఆహార సామగ్రిని, కూరగాయలను అందిస్తున్నాం. కరోనా క్రైసీస్‌ ఛారిటీకి కూడా మా వంతు సాయం చేయాలనుకున్నాం. ఈరోజు నా కుమార్తెలు శివానీ, శివాత్మిక ఇద్దరు కూడా తమ సంపాదనల నుంచి చేరొక రూ.లక్షను విరాళంగా ప్రకటించారు. మా కుటుంబం తరఫున చిన్న సాయం. ఈ కష్టాలు తీరేవరకూ మేము చేయగలిగినంత సాయం చేస్తానని మాట ఇస్తున్నాను. సినీ కార్మికులకు సాయం చేసేందుకు తెలుగు సినీ పరిశ్రమ కలిసి ముందుకు రావడం చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. అలాగే మా తరఫున పేదలకు ఆహార సామగ్రిని అందిస్తున్న కార్మికులకు, పోలీస్‌ అధికారులకు ధన్యవాదాలు. మీ వల్లే మేము సాయం చేయగలుగుతున్నాం. ప్రజలందరూ కూడా తాము చేయగలిగినంత సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని రాజశేఖర్‌ తెలిపారు.

‘జీవితంలో ఎన్నో సందర్భాల్లో మా తల్లిదండ్రులను చూసి మేం స్ఫూర్తి పొందాం. వాళ్లలాగే మేం కూడా బాధ్యతగా వ్యవహరించాలని భావిస్తున్నాం. సీసీసీ కోసం రూ.లక్ష చొప్పున విరాళంగా అందిస్తున్నాం.’ అని శివానీ, శివాత్మిక ట్వీట్‌ చేశారు.



Tags :
జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని