
తాజా వార్తలు
2020 ఇంత కష్టంగా ఎందుకు ఉంది?
విశాఖ గ్యాస్ లీక్‌పై సెలబ్రిటీల స్పందన
హైదరాబాద్: లాక్డౌన్ అనంతరం పరిశ్రమలను పునఃప్రారంభం చేసే సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సినీ సెలబ్రిటీలు కోరుతున్నారు. గురువారం తెల్లవారుజామున విశాఖ నగరంలోని ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదవశాత్తూ గ్యాస్ లీక్ అయ్యింది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటనకు సంబంధించిన విజువల్స్ హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైజాగ్ గ్యాస్‌లీక్ ఘటనపై సెలబ్రిటీలు ఏమంటున్నారంటే...
‘విశాఖలో విషవాయువు స్టైరిన్ బారినపడి ప్రజలు మరణించటం మనసుని కలచివేసింది. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. అస్వస్థతకు గురైన వారందరు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను. లాక్డౌన్ తర్వాత పరిశ్రమలను తిరిగి ప్రారంభించినప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను’ - చిరంజీవి
‘వైజాగ్ గ్యాస్ లీక్ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ప్రభావిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. Stay strong Vizag’ - ఎన్టీఆర్
‘గ్యాస్ లీక్ వార్త విని నా హృదయం బాధాకరంగా మారింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకుని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.’ - మహేశ్‌బాబు
‘‘ఇలాంటి ఘటనలు చాలా బాధాకరం. ఈ ప్రమాదం వల్ల ఇబ్బందిపడుతున్న వారందరూ బాగుండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ ప్రమాదాన్ని త్వరితగతిన కంట్రోల్ చేస్తారని ఆశిస్తున్నాను. వైజాగ్ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండండి’ - రకుల్ ప్రీత్ సింగ్
‘వైజాగ్‌లో జరిగిన ప్రమాదం గురించి విని, ప్రమాదస్థలానికి సంబంధించిన ఫొటోలు చూసి ఎంతో షాక్‌కు గురయ్యాను. అలాగే బాధగా అనిపించింది. ఒక వ్యక్తి నిర్లక్ష్యం ఎందరో ప్రాణాల మీదకు వచ్చింది. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నాను’ -లావణ్య త్రిపాఠి
‘ఉదయం నిద్రలేవగానే వైజాగ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూసి కలత చెందాను. ఈ ప్రమాదానికి గురైన వారందరూ కోలుకోవాలని దేవుడ్ని కోరుకుంటున్నాను.’ - ప్రగ్యా జైస్వాల్
‘‘ఈ బాధాకారమైన వార్తతో నిద్రలేచాను. ఎవరైతే తమకు ఇష్టమైన వారిని కోల్పోయారో వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ - తమన్నా
‘వైజాగ్.. ఉదయం జరిగిన ప్రమాదం వల్ల ఇప్పటికీ ఆ గ్యాస్ అక్కడి గాలిలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతానికి దగ్గర్లో ఉన్న ప్రజలందరూ వెట్ మాస్క్‌తో ముఖాన్ని కప్పుకోగలరు.’ - నిఖిల్
‘వైజాగ్ గ్యాస్ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూసి ఎంతో కలత చెందాను. వాటిని చూడగానే ఇబ్బందిగా అనిపించింది. ఈ ప్రమాదం బారిన పడిన కుటుంబాలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలాగే ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం మళ్లీ సాధారణ స్థాయిలోకి రావాలని కోరుకుంటున్నాను’ - సాయిధరమ్ తేజ్
‘మరో బాధాకరమైన విషయం మనల్ని కలచివేసింది. ఈ ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూస్తే ఎంతో బాధగా అనిపించింది. ఈ ఘటనలో తమకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సానుభూతిని తెలియజేస్తున్నాను. పునఃప్రారంభం చేసే సమయంలో ప్రతి పరిశ్రమ తగిన జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను’ - వరుణ్ తేజ్
‘వైజాగ్ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు చూస్తే విచారంగా అనిపించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే చికిత్స పొందుతున్న వారందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’- అనిల్ రావిపూడి
‘2020 ఇంత కష్టంగా ఎందుకు ఉంది? ఉదయాన్నే వైజాగ్‌లోని ఎల్జి పాలిమర్స్‌లో జరిగిన ఈ గ్యాస్ లీక్ వార్త వినగానే బాధగా అనిపించింది. వారి వారి కుటుంబాలకు నా ప్రగాఢసానుభూతిని తెలియజేస్తున్నాను. అలాగే చికిత్స తీసుకుంటున్న వారందరూ త్వరగా కోలుకోవాలని భావిస్తున్నాను’ - మంచుమనోజ్
‘వైజాగ్ గ్యాస్‌లీక్ ఘటనకు సంబంధించిన విజువల్స్ చూసి నా హృదయం ద్రవించింది. ఈ ప్రమాదం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిద్దాం. అక్కడి పరిస్థితులను సాధారణ స్థాయిలోకి తీసుకురావడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నానికి సంతోషిస్తున్నాను’ - బాబీ