close

తాజా వార్తలు

Published : 16/05/2020 15:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మిస్సింగ్‌.. మిస్సింగ్‌.. అంటోన్న తారాలోకం..!

స్టే హోమ్‌ నినాదంతో చెర్రీ.. బైక్‌ రైడ్‌లో సామ్‌..

హైదరాబాద్‌: మిస్సింగ్‌.. మిస్సింగ్‌.. మిస్సింగ్‌.. ప్రస్తుతం ఏ సినీ సెలబ్రిటీ నోటి నుంచి విన్నా ఇదే మాట వినపడుతోంది. కరోనా విజృంభిస్తోన్న వేళ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించడంతో.. ‘స్టే హోమ్‌ స్టే సేఫ్’ అనే నినాదంతో సెలబ్రిటీలందరూ కొంతకాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ షూటింగ్స్‌లో బిజీగా ఉండే వాళ్లందరూ ఒక్కసారిగా ఖాళీ దొరకడంతో తమలోని కళలకు మెరుగులద్దారు. వంట చేయడం, పెయింటింగ్‌ వేయడం, ఇళ్లు క్లీన్ చేయడం, పెంపుడు జంతువులతో సరదాగా గడపడం, వర్కౌట్లు ఇలా ఎన్ని పనుల్లో ఉన్నప్పటికీ.. షూటింగ్స్‌, సినిమా సెట్స్‌, ఫొటోషూట్స్‌ను మాత్రం బాగా మిస్‌ అవుతున్నామని అంటున్నారు.

ఇటీవల పాయల్‌ రాజ్‌పుత్‌, నిధి అగర్వాల్‌, అనసూయ, శ్రీముఖి.. ఇలా పలువురు నటీమణులు షూటింగ్స్‌ను మిస్‌ అవుతున్నామని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా నటుడు రామ్‌చరణ్‌ సైతం షూటింగ్‌ సెట్స్‌ను మిస్‌ అవుతున్నానని తెలిపారు. కానీ పరిస్థితులు చక్కబడే వరకూ ఇంట్లోనే ఉండాలని సూచించారు. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో సమంత తన భర్త నాగచైతన్యతో కలిసి బైక్‌రైడ్‌లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.











 














Tags :
జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని