జనగామలో జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
close

తాజా వార్తలు

Published : 01/02/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జనగామలో జిల్లాలో భారీ అగ్నిప్రమాదం

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం ఖిల్లా షాపూర్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. తారా ఇండస్ట్రీస్‌ టిన్నర్‌ పరిశ్రమలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. రియాక్టర్లకు ఛార్జింగ్‌ పెడుతుండగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. గమనించిన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు.  సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని