కుటుంబ కలహాలతో భార్యపై కాల్పులు
close

తాజా వార్తలు

Published : 04/02/2020 07:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కుటుంబ కలహాలతో భార్యపై కాల్పులు

జగిత్యాల జిల్లాలో ఘటన

జగిత్యాల: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌పల్లిలో దారుణం జరిగింది. భార్యను హత్య చేసేందుకు భర్త తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన ఒక్కసారిగా కలకలం రేగింది. మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్‌ మరో వ్యక్తితో వచ్చి తుపాకీతో కాల్పులు జరపటంతో బైరం రాజిరెడ్డికి గాయాలయ్యాయి. శ్రీనివాస్‌కు అతని భార్య గీతికకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో కొద్ది రోజులుగా గీతిక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్‌పల్లిలోని మేనమామ ఇంట్లో ఉంటోంది. అర్ధరాత్రి సమయంలో వచ్చిన శ్రీనివాస్‌ గొడవకు దిగాడు. తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు... ఈ క్రమంలో అడ్డువచ్చిన రాజిరెడ్డికి బుల్లెట్లు తగిలాయి. తీవ్రంగా గాయపడిన రాజిరెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. 

ఘటనపై జగిత్యాల డీఎస్పీ వెంకట రమణ విచారణ జరుపుతున్నారు. తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, కారణాలు ఏమిటి అనే  కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ రాజిరెడ్డి కి జగిత్యాల ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని