ఓ ప్రేమా.. ఇక సెలవు!
close

తాజా వార్తలు

Updated : 14/02/2020 07:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఓ ప్రేమా.. ఇక సెలవు!

ప్రేయసి వివాహం రోజున ప్రియుడి ఆత్మహత్య

షాద్‌నగర్‌: ఆ యువకుడు ఓ యువతిని ప్రేమించాడు. కులాలు వేరు కావడంతో ఆమెతో పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు. చివరకు ఆమెకు వేరొకరితో వివాహం కుదిరింది.. గురువారమే ఆమె పెళ్లి. తను లేని జీవితాన్ని ఊహించుకోలేక మనోవ్యథకు గురైన ఆ యువకుడు ముందురోజు ఆత్మహత్య చేసుకుని కుటుంబంలో విషాదాన్ని నింపాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రైల్వేస్టేషన్‌ వద్ద వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన విజయ్‌(24) షాద్‌నగర్‌ సమీపంలోని దూసకల్‌ రోడ్డులో గల ఓ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయలు దేరిన అతడు రాత్రి తిరిగి రాలేదు. గురువారం తెల్లవారుజామున పురుగుల మందు తాగి రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారమందడంతో కాచిగూడ రైల్వే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. జేబులో ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబీకులకు సమాచారమిచ్చారు. మృతదేహానికి షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ప్రేమ వైఫల్యమే విజయ్‌ ఆత్మహత్యకు కారణమని, కొద్దిరోజులుగా తీవ్ర మనస్తాపంతో ఉన్నట్లు తెలుస్తుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని