కోడి కోసం ఘర్షణ:కొడుకుని చంపేసిన తండ్రి
close

తాజా వార్తలు

Published : 24/02/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోడి కోసం ఘర్షణ:కొడుకుని చంపేసిన తండ్రి

గుమ్మలక్ష్మీపురం: విజయనగరం జిల్లా బొద్దిడిలో దారుణం చోటుచేసుకుంది. కోడి కోసం జరిగిన గొడవ హత్యకు దారితీసింది. వివరాల్లోకి వెళితే గుమ్మలక్ష్మీపురం మండలం బొద్దిడిలో అడ్డాకుల మద్దేశ్వరరావు (22) అనే వ్యక్తి తన పెరట్లో కోడిని పెంచుకుంటున్నాడు. అతడి తండ్రి కాంతారావు ఆ కోడిని గ్రామ సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచడంతో అది చనిపోయింది. ఇంటికొచ్చిన కుమారుడు కోడి గురించి ఆరా తీయగా మృతిచెందినట్లు తండ్రి బదులిచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఆవేశానికి గురైన తండ్రి.. కత్తితో కొడుకు ఛాతిపైన పొడిచాడు. దీంతో మద్దేశ్వరరావు అక్కడే కుప్పకూలిపోవడంతో కుటుంబసభ్యులు భద్రగిరిలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆయన మృతిచెందాడు. అనంతరం తండ్రి కాంతారావు పరారయ్యాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని