సింగంపల్లిలో 10నెలల చిన్నారి కిడ్నాప్‌!
close

తాజా వార్తలు

Updated : 09/03/2020 02:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగంపల్లిలో 10నెలల చిన్నారి కిడ్నాప్‌!

మహాముత్తారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం సింగంపల్లిలో చిన్నారి అపహరణ కలకలం రేపింది. ఈ సాయంత్రం ద్విచక్ర వాహనంపై వచ్చి 10నెలల వయసున్న హరీశ్‌ను ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. అపహరణ దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. చిన్నారి అపహరణతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ సాయంత్రం ఇంటి బయటే చిన్నారిని మంచంపై అతడి నాయనమ్మ పడుకోబెట్టింది. చిన్నారి తల్లి సహా ఇతర కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి వద్దకు వచ్చి చిన్నారి నాయనమ్మతో మాట కలిపారు. మీకు రెండుపడక గదుల ఇల్లు మంజూరైందని.. ఆధార్‌, రేషన్‌ కార్డులు కావాలని చెప్పడంతో వాటిని తీసుకొచ్చేందుకు ఆమె ఇంటిలోపలికి వెళ్లింది. అదే సమయంలో చిన్నారి ఇద్దరు దుండగులు అపహరించి ద్విచక్ర వాహనంపై ఎత్తుకెళ్లారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దుండగులు వయసు 25-27 ఏళ్ల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. ఆందోళన చెందవద్దని.. రేపు ఉదయానికల్లా చిన్నారిని అప్పగిస్తామని తల్లిదండ్రులకు పోలీసులు హామీఇచ్చారు. చిన్నారి అపహరణ నేపథ్యంలో చుట్టుపక్కల పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. దుండగుల కోసం పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని