ఇంగ్లాండ్‌లో భారత విద్యార్థి మృతి
close

తాజా వార్తలు

Updated : 08/04/2020 01:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంగ్లాండ్‌లో భారత విద్యార్థి మృతి

లాక్‌డౌన్‌ కారణంగా తల్లడిలుతున్న తల్లిదండ్రులు

లండన్‌: ఉన్నత చదువుల కోసం ఇంగ్లాండ్‌ వెళ్లిన ఓ భారతీయ విద్యార్థి అక్కడ మృతిచెందడంతో ఇక్కడ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అక్కడికి వెళ్లలేని వారు తమ కుమారుడి మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని యూకే ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. సిద్ధార్థ్‌ ముర్కుంబి(23) అనే పుణె విద్యార్థి సెంట్రల్‌ లాంకషైర్‌ యూనివర్శిటీలో మార్కెటింగ్‌ కోర్సు చదువుతుండగా గతనెల 15న తప్పిపోయాడు. తాజాగా రిబ్బ్‌ల్‌ నదిఒడ్డున అతడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో పుణెలోని అతని తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతంగా ఉంది . సిద్ధార్థ్‌ మృతదేహాన్ని భారత్‌కు పంపించాలని తండ్రి శంకర్‌ ముర్కుంబి ఇంగ్లాండ్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గతనెలలో తప్పిపోయిన సిద్ధార్థ్‌ నది ఒడ్డున విగతజీవిగా కనిపించడంతో, అతను ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘మా కుమారుడి మృతదేహం రిబ్బ్‌ల్‌ నది ఒడ్డున గుర్తించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని రాయల్‌ ప్రిస్టన్‌ ఆస్పత్రి శవాగారానికి తరలించామన్నారు. అక్కడ కొరోనర్‌ విచారణ(శవ పంచనామా) జరగాల్సి ఉంది’ అని శంకర్‌ మీడియాతో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని