అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Published : 10/04/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య

శేరిలింగంపల్లి(హైదరాబాద్‌): అనుమానాస్పద స్థితిలో ఓ యువతి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన చందానగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చందానగర్‌ రాజీవ్‌ స్వగృహలో నివాసం ఉండే ఏడుకొండలు, శమంతకమణి దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.

దంపతులిద్దరూ టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె అంబిక(21) బీటెక్‌ చదువుతూ.. స్థానికంగా ఓ ప్రైవేటు సంస్థలో ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తోంది. ఇవాళ ఉదయం రాజీవ్‌ స్వగృహలోని అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. 
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని