వైద్యులు, పోలీసులపై రాళ్లదాడి
close

తాజా వార్తలు

Published : 16/04/2020 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైద్యులు, పోలీసులపై రాళ్లదాడి

లఖ్‌నవూ: కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లదాడికి దిగారు. వారి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. దీనిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

మొరాదాబాద్‌లోని నవాబ్‌పురా కాలనీలో ఇద్దరు కరోనా అనుమానితుల్ని తీసుకెళ్లేందుకు వైద్య సిబ్బంది అంబులెన్సులో అక్కడికి చేరుకున్నారు. వారి రాకను గమనించిన స్థానికులు రాళ్లు, ఇటుకులతో దాడికి దిగారు. వైద్య సిబ్బందికి రక్షణగా వచ్చిన పోలీసు వాహనాలపైనా వారు దాడి చేశారు. ఈ ఘటనలో పలువురు వైద్య, పోలీసుల సిబ్బందికి గాయాలయ్యాయి.

ఈ ఘటనతో సంబంధం ఉన్న 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురి కోసం గాలిస్తున్నారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దాడికి పాల్పడిన వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించారు. జరిగిన ఆస్తి నష్టాన్ని కూడా వారి నుంచే వసూలు చేయాలన్నారు. ఘటన అనంతరం స్థానికంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని