కన్న తల్లినే డంబెల్‌తో కొట్టి చంపి!
close

తాజా వార్తలు

Published : 26/04/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కన్న తల్లినే డంబెల్‌తో కొట్టి చంపి!

ఆదోని క్రైమ్‌‌: కర్నూలు జిల్లా ఆదోని ఎస్బీఐ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఎస్‌. గంగాబాయ్‌(63) అనే మహిళను కన్న కొడుకే హత్య చేశాడు. డంబెల్‌తో తలపై మోది దారుణంగా హతమార్చాడు. ఈ మేరకు వివరాలను సీఐ పార్థసారథి వెల్లడించారు. ఆదోని పట్టణంలోని ఎస్బీఐ-2 కాలనీలో గంగాబాయ్‌ నివాసముంటున్నారు. గత 5 నెలలుగా మానసిక స్థితి సరిగాలేని ఆమె కుమారుడు రాజ్‌ కిరణ్..శనివారం రాత్రి తల్లితో గొడవ పడి డంబెల్‌తో తలపై బలంగా మోది హత్య చేశాడు. ఈ క్రమంలో ఆమె కేకలు విన్న కాలనీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడు రాజ్‌కిరణ్‌ను అదుపులోకి  తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని