నమ్మించి.. మోసం చేసి
close

తాజా వార్తలు

Published : 16/05/2020 07:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నమ్మించి.. మోసం చేసి

 

 అక్కబావల వంచనను జీర్ణించుకోలేని నవ వధువు
 మనస్తాపంతో ఆత్మహత్య

గుడివాడ : కూతురు, అల్లుడు వచ్చి ఇల్లు కట్టుకుంటాం.. బ్యాంకులో తాకట్టు పెట్టేందుకు పొలం డాక్యుమెంట్లు కావాలని అడిగారు.. వారి కోరికను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. ఈ క్రమంలో తమ చిన్న కుమార్తె వివాహాన్ని గత నెలలో జరిపించారు. ఆమెకు కానుక కింద అరెకరం పొలం పెట్టారు. ఈ నేపథ్యంలో పొలం తాలుకా డాక్యుమెంట్లు కావాలని అడగడంతో కూతురు, అల్లుడు చేసిన మోసం బయటపడింది. అంతటితో ఆగలేదు.. తమ చిన్నకూతురిని దూషించారు. దీంతో మనస్తాపం చెందిన నవవధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. గుడివాడ ఒకటో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. బేతవోలు నిమ్మతోటలో నివాసముంటున్న వీరంకి గంగారావు, చుక్కమ్మల చిన్నకుమార్తె ఆరేపల్లి మౌనిక. గత నెలలో కొడాలికి చెందిన డేనియల్‌ను వివాహం చేసుకుంది. ఆమె తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఈ నేపథ్యంలో పమిడిముక్కల మండలం వీరంకిలాకులో నివాసముండే ఆమె అక్క, బావ బొల్లా నాగలక్ష్మి, శ్రీనివాసరావు ఇల్లుకట్టుకుంటున్నాం బ్యాంకు ష్యూరిటీ కోసమని మౌనిక తల్లి చుక్కమ్మ పేరుతో ఉన్న ఎకరంన్నర పొలం డాక్యుమెంట్లు కావాలని తీసుకున్నారు. తల్లిదండ్రులను మోసం చేసి ఆ భూమిని తమ పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. గత నెలలో మౌనిక వివాహమైంది. కట్నం కింద ఎకరంన్నరలో అర ఎకరం ఆమె పేరుతో తల్లిదండ్రులు రాశారు. ఆ భూమి డాక్యుమెంట్లు కావాలని తమ పెద్ద కుమార్తెను కోరారు. వారు ఇదిగో అదిగో ఇస్తామని చెపుతూ వచ్చి చివరకు భూమి తమపేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నామని, ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో మౌనిక అక్కబావలను ఫోన్లో నిలదీయడంతో ఆమెను వారు ఇష్టం వచ్చినట్లు దూషించారు. తన సంరక్షణలో పెరిగిన అక్కకొడుకు కూడా అనరాని మాటలు అనడంతో ఆమె తట్టుకోలేకపోయింది. తల్లి, భర్త ఇంట్లో లేని సమయంలో శుక్రవారం పొలం కోసం తెచ్చిన గుళికలు తిన్నది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రాంతీయ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె శుక్రవారం రాత్రి మృతి చెందింది. తల్లి చుక్కమ్మ ఫిర్యాదు మేరకు పెద్ద కుమార్తె బొల్లా నాగలక్ష్మి, అల్లుడు శ్రీనివాసరావు, మనమలు సాయి, మరో బాలుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దుర్గాప్రసాద్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని