ప్రేమతో మొదలై.. మృత్యువుతో ముగిసి
close

తాజా వార్తలు

Updated : 20/05/2020 10:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రేమతో మొదలై.. మృత్యువుతో ముగిసి

రైలుకు ఎదురెళ్లి జంట బలవన్మరణం

న్యూస్‌టుడే - చేగుంట, వెల్దుర్తి, మల్కాజిగిరి: నడుస్తున్న రైలుకు ఎదురుగా ఒకరినొకరు చేతులు పట్టుకొని వెళ్లి ఆత్మహత్య చేసుకున్న జంట ఉదంతమిది. మెదక్‌ జిల్లా మాసాయిపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. చేగుంట, మల్కాజిగిరి ఠాణాలు, కామారెడ్డి రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మల్కాజిగిరికి చెందిన యువతి (29), యువకుడు (30) కలిసి బైక్‌పై వచ్చి నిజామాబాద్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళుతున్న రైలుకు ఎదురుగా వెళ్లి బలవన్మరణానికి పాల్పడ్డారు. గమనించిన పైలట్‌ కొద్దిదూరంలో రైలును నిలిపి విషయాన్ని రైల్వే పోలీసులకు తెలిపారు. ఈ జంటకు గతంలోనే వేర్వేరుగా ఇతరులతో వివాహాలు అయ్యాయి. యువతికి భర్త, పదేళ్లలోపు ముగ్గురు కుమారులున్నారు.  యువకుడికి భార్య, ఇద్దరు సంతానం. అతను నగరంలో ప్రైవేటు ఉద్యోగి. వారిద్దరికి గతంలోనే మల్కాజిగిరిలో దుస్తుల దుకాణంలో పని చేసినపుడు పరిచయమై ప్రేమించుకున్నారు. వేరేవారితో పెళ్లిళ్లు అయిన తర్వాత కూడా కలుసుకునేవారు. మంగళవారం యువతి దంపతుల మధ్య గొడవ జరిగింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆమె లేఖ రాసి ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే ఎస్సై తావునాయక్‌ వచ్చి పరిశీలించి మృతదేహాలను కామారెడ్డి ఆసుపత్రికి తరలించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని