యూపీలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
close

తాజా వార్తలు

Published : 05/06/2020 13:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యూపీలో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి

మృతుల్లో ఇద్దరు చిన్నారులు

ప్రయాగ్‌రాజ్‌: ఉత్తర్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌గఢ్‌‌ జిల్లాలోని నవాబ్‌గంజ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ వాహనం, ట్రక్కు ఢీకొన్న సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మది మంది మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలతో సహా ఇద్దరు చిన్నారులు ఉన్నారు. పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..
 

ఈ తెల్లవారుజామున 5.30కు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు స్కార్పియో వాహనంలో రాజస్థాన్‌ నుంచి బిహార్‌లోని భోజ్‌పూర్‌కు వెళ్తున్నారు. వజీద్‌పూర్‌ గ్రామ సమీపంలో వీరి వాహనం ఎదురుగా వస్తోన్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే తొమ్మది మంది మృతి చెందగా... తీవ్రంగా గాయపడిన ఒకరిని చికిత్స కోసం లఖ్‌నవూకు తరలించారు. ప్రమాదంలో వాహనం తీవ్రంగా దెబ్బతినడంతో అందులో చిక్కుకున్నవారిని బయటకు తీసేందుకు గ్యాస్‌ కట్టర్లను ఉపయోగించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. కాగా, ట్రక్కు డ్రైవరు సంఘటనా స్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు. ఈ దుర్ఘటన పట్ల యూపీ‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని