ఒంటిపై 28 కత్తిపోట్లు!
close

తాజా వార్తలు

Updated : 21/06/2020 07:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఒంటిపై 28 కత్తిపోట్లు!

మధ్యాహ్నం చర్చలు.. రాత్రికి హతం

కాంగ్రెస్‌ నేత హత్య కేసులో వెలుగులోకి పలు అంశాలు


రాంచంద్రారెడ్డి మృతదేహం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: భూమి విషయంలో మధ్యాహ్నం చర్చలు.. సాయంత్రం మరో దఫా జడ్చర్ల సీనియర్‌ కాంగ్రెస్‌ నేత రాంచంద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డి మధ్య చర్చలు జరిగినా ఫలించలేదు. ఆతరవాత రాంచంద్రారెడ్డి మృతదేహంపై ఏకంగా 28 కత్తిపోట్లు. మెడ నుంచి పొట్ట వరకు విచక్షణా రహితంగా దాడి. రాంచంద్రారెడ్డి హత్యోదంతంలో వెలుగుచూసిన దారుణమిది. ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితులు పోలీసులకు లొంగిపోయినట్లు తెలిసింది.

మాట్లాడదామని పిలిచే..

రాంచంద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో షాద్‌నగర్‌లో కలుసుకొని అన్నారం భూ వ్యవహారంపై చర్చించారు. తనకు జడ్చర్లలో పనుందని, సాయంత్రం మరోసారి కలుసుకుందామని రాంచంద్రారెడ్డి వెళ్లిపోయారు. ఈ వ్యవహారానికి సంబంధించి ప్రతాప్‌రెడ్డికి మృతుడు రూ.కోట్లలో డబ్బు ఇస్తానని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ డబ్బు విషయంలో సాగదీత ధోరణి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ప్రతాప్‌రెడ్డి మరో వ్యక్తితో కలిసి అక్కడ్నుంచి ఇన్నోవాలో రాంచంద్రారెడ్డిని తీసుకుని పరారయ్యాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం ప్రతాప్‌రెడ్డి వెంట కత్తి తెచ్చుకున్నట్లు అనుమానిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో..

ప్రతాప్‌రెడ్డి కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పలువురి నుంచి అప్పు తీసుకున్నట్లు, వారికి శుక్రవారం డబ్బులు ఇస్తానని పేర్కొన్నట్లు తెలిసింది. రాంచంద్రారెడ్డి డబ్బులు ఇవ్వకపోవడం, ఆపై దూషించడం నేపథ్యంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ప్రతాప్‌రెడ్డితో మరో వ్యక్తి ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు ప్రస్తుతానికి పోలీసులు అంచనాకు వచ్చినా.. ఇంకా ఎవరైనా ఉన్నారా..? మరెవరైనా ప్రోత్సహించారా..? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

జడ్చర్లలో అంత్యక్రియలు

జడ్చర్ల గ్రామీణం: హత్యకు గురైన రాంచంద్రారెడ్డి అంత్యక్రియలు శనివారం జడ్చర్లలో నిర్వహించారు. కొత్త బస్‌స్టాండు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఆయన వ్యవసాయ పొలంలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రి చిన్నారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి, తెదేపా నాయకుడు మోపతయ్య, అంత్యక్రియల్లో పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, రాష్ట్ర సంగీత నాట్యమండలి అధ్యక్షుడు బి.శివకుమార్‌, మాజీ ఎమ్మెల్యే మల్లు రవి ఆయన భౌతికకాయానికి నివాళి అర్పించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని