భార్యను కాల్చి..అత్తను హతమార్చి
close

తాజా వార్తలు

Published : 24/06/2020 01:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

భార్యను కాల్చి..అత్తను హతమార్చి

అనంతరం ఆత్మహత్య

కోల్‌కతా: బెంగళూరులో భార్యను కాల్చి చంపిన భర్త నేరుగా కోల్‌కతా వెళ్లి అత్తను హతమార్చిన ఘటన ఆ రెండు రాష్ట్రాల్లో కలకలం సృష్టించింది. కోల్‌కతా పోలీసుల వివరాల ప్రకారం.. బెంగళూరులో నివసించే చార్టెడ్‌ అకౌంటెంట్‌ అమిత్‌ (42) భార్యతో విడిపోయాడు. విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డాడు. ఈ నేపథ్యంలోనే అతడు కోల్‌కతాలోని పూల్‌బగన్‌లో ఉన్న అత్తామామల ఇంటికి వెళ్లి వారితో తీవ్రంగా గొడవపడ్డాడు. అనంతరం కోపంతో వెంట తీసుకెళ్లిన తుపాకితో అత్తను కాల్చాడు. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనకు గురైన మామ తప్పించుకొని వెళ్లి అపార్ట్‌మెంట్‌ వాసుల సాయం కోరాడు.  

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని చూడగా అత్తతో పాటూ అమిత్‌ కూడా రక్తపు మడుగులో పడి ఉన్నారు. అత్తను కాల్చాక అమిత్‌ తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసులు నిర్ధరించారు. అయితే అమిత్ నుంచి సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, తను కోల్‌కతాకు వచ్చి అత్తను హత్య చేసే ముందే బెంగళూరులో భార్యను చంపినట్లు తెలుసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని