మాస్కు వేసుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి
close

తాజా వార్తలు

Updated : 30/06/2020 11:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్కు వేసుకోమన్నందుకు ఉద్యోగినిపై దాడి

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మాస్కు వేసుకోమని చెప్పినందుకు తోటి ఉద్యోగినిపై మరో ఉద్యోగి విచక్షణా రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేపింది. 

పోలీసులు కథనం ప్రకారం...  నెల్లూరులోని ఏపీ టూరిజం హోటల్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ ఇనుప రాడ్డుతో దాడి చేశారు. కరోనా నేపథ్యంలో మాస్కు వేసుకోమన్నందుకు ఆగ్రహించిన డిప్యూటీ మేనేజర్‌ ..మహిళా ఉద్యోగిపై విచక్షణారహితంగా దాడి చేశారు. అడ్డుకున్న తోటి ఉద్యోగులపైనా ఆగ్రహం వెళ్లగక్కారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో వెలుగులోకి వచ్చింది. మహిళా ఉద్యోగి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు డిప్యూటీ మేనేజర్‌ భాస్కర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన అధికారులు చర్యలకు సిఫార్సు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని