తాగొద్ద‌న్నందుకు త‌ల్లినే కాల్చిచంపిన యువ‌కుడు!
close

తాజా వార్తలు

Published : 05/07/2020 03:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తాగొద్ద‌న్నందుకు త‌ల్లినే కాల్చిచంపిన యువ‌కుడు!

దిల్లీ: మ‌ద్యం తాగుతున్నాడని మంద‌లించినందుకు క‌న్నత‌ల్లినే కాల్చిచంపిన విషాధ ఘ‌ట‌న దిల్లీలో చోటుచేసుకుంది. ఉత్త‌ర దిల్లీలోని బ‌వనాన‌గ‌ర్‌కు చెందిన సుర‌జ్‌(26) అనే యువ‌కుడు డ్రైవ‌రుగా ప‌నిచేస్తున్నాడు. నిత్యం మ‌ద్యం తాగడంతోపాటు ఇంటికి ఆల‌స్యంగా వ‌స్తుండ‌డంతో త‌ల్లి మంద‌లించింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ యువ‌కుడు మ‌ద్యం మ‌త్తులో త‌న ద‌గ్గ‌రున్న ‌నాటు తుపాకీతో త‌ల్లిపై కాల్పులు జ‌రిపాడు. ఆమె ఎడ‌మ కంటిలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయ‌ప‌డింది. విష‌యాన్ని స్థానికులు పోలీసుల‌కు తెలియ‌జేశారు. అనంత‌రం ఆ మ‌హిళ‌(60)ను ఆసుప‌త్రికి తీసుకెళ్ల‌గా అప్ప‌టికే మృతిచెందినట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. యువ‌కుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అత‌ని నుంచి నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. మ‌ద్యం తాగకూడదని వారించినందుకే అతను కాల్పులు జ‌రిపిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింద‌ని దిల్లీ పోలీసులు వెల్ల‌డించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని