మహిళా ఎస్సైపై వాలంటీర్‌ అసభ్య ప్రవర్తన
close

తాజా వార్తలు

Updated : 08/07/2020 12:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహిళా ఎస్సైపై వాలంటీర్‌ అసభ్య ప్రవర్తన

ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్థానిక 21వ వార్డుకు చెందిన వాలంటీర్‌ మహిళా ఎస్సైపై అసభ్యంగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో బూతులు తిడుతూ వీరంగం సృష్టించాడు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రోజాలత పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా.. మద్యం సేవించి అటుగా వచ్చిన వాలంటీర్‌ను పోలీసు సిబ్బంది ఆపారు. రెచ్చిపోయిన వాలంటీర్‌ ఎస్సైను దుర్భాషలాడాడు. మహిళా ఎస్సై అని కూడా చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అంతు చూస్తానంటూ బెదిరించాడు. నడిరోడ్డుపై చొక్కా విప్పి వీరంగం సృష్టించాడు. అతనితో మరో వాలంటీర్‌ భర్త కూడా ఉన్నాడు. వీరిద్దరిపై సీఐ పాపారావు కేసు నమోదు చేయగా.. ఆ మరుసటి రోజే సీఐ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని