ఆగంతకుడు ఎవరు..?
close

తాజా వార్తలు

Updated : 20/10/2020 09:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆగంతకుడు ఎవరు..?

100 మంది పోలీసుల గాలింపు

మహబూబాబాద్‌,  నెహ్రూసెంటర్‌

 మహబూబాబాద్‌ పట్టణంలో అపహరణకు గురైన దీక్షిత్‌రెడ్డి తల్లి వసంతకు కిడ్నాపర్‌ నుంచి ఫోన్‌ రావడంతో తెలిసిన వారిపనే అయి ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కూడా ఈ కోణంలో విచారణ చేస్తున్నట్లు సమాచారం. అలాగే దీక్షిత్‌ రెడ్డి స్నేహితుడు తెలిపిన వివరాల ఆధారంగా అతడిని వెంట తీసుకొని కాలనీలో విచారణ చేశారు. కాలనీలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి.. బైక్‌ ఎటు నుంచి వచ్చింది.. వెళ్లిందనే దానిపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు ఉన్న ఇళ్లలో సీసీ పుటేజీలను సేకరించారు. ఓ కిరాణం దుకాణంలో లభించిన ఫుటేజీతో విచారణ కొనసాగిస్తున్నారు. దీంతో పాటు బాలుడి తండ్రి రంజిత్‌కు చుట్టపక్కల ప్రాంతాల్లో ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా అన్న కోణంలోనూ విచారిస్తున్నారు.

హైదరాబాద్‌ నుంచి సైబర్‌ క్రైం బృందం..

సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న సైబర్‌ క్రైం పోలీసులు

కేసును విచారించేందుకు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి నలుగురితో కూడిన సైబర్‌ క్రైం నిపుణులను ఎస్పీ రప్పించారు. వారికి జరిగిన ఘటనను వివరాలు వెల్లడించి, సంబంధిత సీసీ ఫుటేజీలను చూపించారు. వీటి ఆధారంగా నాలుగు బృందాలు బయట ప్రాంతాల్లో విచారించేందుకు వెళ్లినట్లు విశ్వసనీయ సమచారం.

జ్వరంగా ఉంటే మాత్ర వేశాం..

అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతున్న ఎస్పీ కోటిరెడ్డి

దివారం రాత్రి బాలుడి తల్లి వసంతకు ఇంటర్నెట్‌ కాల్‌ చేసిన ఆగంతకుడు ‘పోలీసులకు ఫిర్యాదు ఇవ్వొద్ధు. మీ ఇంటి పరిసరాల్లో మా మనుషులు ఉన్నారు. మీరేం చేస్తున్నది మాకు తెలుస్తుంది. మీ బాబుకు జ్వరంగా ఉంది. మాత్రలు కూడా వేశాం’ అని చెప్పి ఫోన్‌ కట్‌ చేసినట్లు దీక్షిత్‌రెడ్డి తండ్రి రంజిత్‌ తెలిపారు.

తెల్లవారుజాము వరకు ఎస్పీ పరిశీలన..

కిడ్నాప్‌నకు గురైన దీక్షిత్‌రెడ్డి స్నేహితులతో టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మాట్లాడుతున్న ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

కిడ్నాప్‌ అయిన ఫిర్యాదు వచ్చిన వెంటనే ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. ఘటనా స్థలికి వచ్చి రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు ఎస్పీ కోటిరెడ్డి బాలుడు కిడ్నాప్‌ అయిన ఇంటి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెంటనే గాలింపు చర్యలకు ఆదేశించారు. రంజిత్‌ చెప్పిన అనుమానితుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. పట్టణ పరిధిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 120 సీసీ కెమెరాలు, ప్రైవేట్‌ వ్యక్తులు ఏర్పాటు చేసిన మరో 80 సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. కృష్ణకాలనీలో ఒక వీధిలోని సీసీ కెమెరాలో బాలుడిని కిడ్నాప్‌ చేసుకుని బైక్‌పై వెళుతున్నట్లుగా గుర్తించారు. అవి స్పష్టంగా లేకపోవడంతో బైక్‌ వెళ్లిన ఆధారంగా పరిసర ప్రాంతాల్లో కూడా ముమ్మర గాలింపు చేపట్టారు. రంజిత్‌కు పరిచయాలు ఉన్నవారితోనూ విచారణ చేపట్టారు. బాలుడిని కిడ్నాప్‌ చేసిన వ్యక్తి తాను ఎక్కడున్నాడో తెలియకుండా ఉండేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఇంటర్నెట్‌ కాల్‌ చేస్తున్నాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని