ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరిట కిడ్నాప్‌
close

తాజా వార్తలు

Updated : 31/10/2020 10:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ప్రేమ పేరిట కిడ్నాప్‌

బాలికను తీసుకెళ్లిన యువకుడి రిమాండ్‌

 

నేరేడ్‌మెట్‌: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన ఓ బాలికను ప్రేమ పేరుతో కిడ్నాప్‌ చేసిన యువకుడిని హైదరాబాద్‌ నాచారం పోలీసులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలిక(16)కు ఇన్‌స్టాగ్రామ్‌లో కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన మధు (25) పరిచయమయ్యాడు. తనను ప్రేమిస్తున్నానని మధు చెప్పడంతో ఆ బాలిక నమ్మింది. పది రోజుల క్రితం అతడు నగరానికి వచ్చి బాలికను కిడ్నాప్‌ చేసి బళ్లారికి తీసుకెళ్లాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలిక ఫోను లొకేషన్‌ ఆధారంగా బళ్లారిలో ఉన్నట్లు గుర్తించి తీసుకొచ్చారు. మధును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని