కలెక్టర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌
close

తాజా వార్తలు

Published : 06/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కలెక్టర్‌ ఫేస్‌బుక్‌ ఖాతా హ్యాక్‌


వివరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ 

కలెక్టరేట్(విజయనగరం), న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లు సామాన్యులనే కాదు.. వీఐపీలనూ వదలడం లేదు. కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేశారు. ఆయన పేరుతో నకిలీవి సృష్టించి వందలాది మందికి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లు పెట్టారు. కలెక్టర్‌ కదా అని అంతా స్నేహితునిగా అంగీకరించారు. తర్వాత ఒక్కొక్కరికీ మెసెంజర్‌ ద్వారా సంక్షిప్త సందేశాలు వెళ్లాయి. రూ.10 వేలు, రూ.15 వేలు, రూ.25 వేలు కావాలని, స్నేహితుడి ఫోన్‌పే లేదా గూగుల్‌పేకు పంపాలని, మళ్లీ ఆ మొత్తాన్ని రేపు పంపిస్తానని అవతలి వ్యక్తులు కోరారు. కొంతమంది నేరుగా ఈ విషయమై కలెక్టర్‌కు ఫోన్‌ చేసి అడగగా.. అటువంటిదేమీ లేదని, ఎవరూ నమ్మవద్దని ఆయన సూచించారు. దీనిపై కలెక్టర్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ ఈ విషయం తన దృష్టికి వచ్చిందని, తన ముఖపుస్తకం ఖాతాను తొలగించానని, సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో ఎవరూ పడవద్దని సూచించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, నిందితుడిని పట్టుకుంటారని తెలిపారు.
కొవిడ్‌ కంట్రోల్‌రూం తనిఖీ... కలెక్టరేట్, న్యూస్‌టుడే: కరోనా సంబంధిత సమాచారం, ఇతర సేవలు అందించే నిమిత్తం కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన కొవిడ్‌ కంట్రోల్‌రూంను కలెక్టర్‌ ఎం.హరిజవహర్‌లాల్‌ మంగళవారం తనిఖీ చేశారు. అక్కడున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. కంట్రోల్‌రూం ద్వారా అందుతున్న సేవలను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి కరోనా కట్టడిలో భాగస్వాములవ్వాలని ఆయన   సూచించారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని