
తాజా వార్తలు
విశాఖలో డ్రగ్స్ కలకలం
ఎల్ఎస్డీ స్వాధీనం.. అయిదుగురి అరెస్టు
విశాఖపట్నం(ఎం.వి.పి.కాలనీ): విశాఖ నగరంలో లైసర్జిక్ యాసిడ్ డైఇథైలమైడ్(ఎల్ఎస్డీ) బోల్ట్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, అయిదుగురిని ఆదివారం అరెస్టు చేసినట్లు నగర పోలీసు కమిషనర్(సీపీ) మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. విశాఖ నగర పరిధి పి.ఎం.పాలెంలో నివసిస్తున్న అరవింద్ అగర్వాల్(21) బెంగళూరులో చదువుతున్నప్పుడు ఎల్ఎస్డీ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకున్నాడు. విశాఖకు తిరిగొచ్చిన తర్వాత వాటిని ఇక్కడ విక్రయించి, డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఈమేరకు ఆన్లైన్లో డార్క్ వెబ్సైట్లో బిట్‌కాయిన్ విధానంలో ఒక్కో ఎల్ఎస్డీని రూ.400 చొప్పున కొనుగోలు చేసేవాడు. వాటిని చిన్ననాటి స్నేహితులు కె.సాహిల్(20), బిల్లా చంద్రశేఖర్(28), మైఖేల్ వెల్కమ్(22), ఎం.మురళీధర్(20), వై.అశోక్(22)కు ఒక్కొక్కటి రూ.1000కు విక్రయించేవాడు. వారు వాటిని కళాశాల విద్యార్థులకు రూ.2వేల చొప్పున విక్రయించేవారు. పక్కా సమాచారంతో వై.అశోక్ మినహా మిగిలిన వారందరినీ అరెస్టు చేసి, వారి నుంచి 27 ఎల్ఎస్డీ బోల్ట్స్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వివరించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆ ఓటమి కన్నా ఈ డ్రా మరింత ఘోరం
- హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం
- బాయ్‌ఫ్రెండ్ ఫొటో పంచుకున్న కాజల్
- తాగడానికి తగని సమయముంటదా..!
- సిరాజ్.. ఇక కుర్రాడు కాదు
- కన్న కూతురిపై ఏడేళ్లుగా అత్యాచారం
- చీరకట్టుతో కమలా హారిస్ ప్రమాణ స్వీకారం?
- ఆఖరి రోజు ఓపిక పడితే..!
- ఆఖరి రోజు ఆసీస్‌కు భయం.. ఎందుకంటే!
- పాచిపెంట ఎస్సైపై యువకుల దాడి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
