చెవులు, ముక్కు కోసి.. భార్యలపై హత్యాయత్నాలు
close

తాజా వార్తలు

Updated : 19/04/2021 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెవులు, ముక్కు కోసి.. భార్యలపై హత్యాయత్నాలు

పోలీసులకు అందిన ఫిర్యాదుతో వెలుగులోకి

చింతూరు, న్యూస్‌టుడే: తనపై భర్త కల్యాణం వెంకన్న పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్యాయత్నానికి పాల్పడ్డాడని చిన్న భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం చట్టి గ్రామానికి చెందిన కల్యాణం వెంకన్నకు ఇద్దరు భార్యలు. నాలుగు రోజుల కిందట పెద్ద భార్య ముక్కు, చెవులను కత్తితో కోయడంతో ఆమె భయంతో తెలంగాణలోని వరంగల్‌ సమీపంలో ఉన్న పుట్టింటికి వెళ్లింది. అదే రోజు వెంకన్న.. తన చిన్న భార్యను మాయమాటలతో అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించాడు. గాయపడిన ఆమె తప్పించుకొని భద్రాచలంలోని తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది. ఆ తరువాత రోజు వెంకన్న భద్రాచలం వెళ్లి గొడవకు దిగడంతో బాధితురాలు చింతూరు పోలీసులను ఆశ్రయించింది. ఆయనపై కేసు నమోదు చేశామని ఎస్సై సురేష్‌బాబు తెలిపారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని