గూడ్స్‌ను తప్పించుకోబోతే కోణార్క్‌ ఢీకొట్టింది!
close

తాజా వార్తలు

Updated : 08/05/2021 07:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గూడ్స్‌ను తప్పించుకోబోతే కోణార్క్‌ ఢీకొట్టింది!

ఇద్దరు రైల్వే ఉద్యోగుల మృతి

మహబూబాబాద్‌ రూరల్‌, న్యూస్‌టుడే: విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రైలు ఢీకొని ఇద్దరు రైల్వే ఉద్యోగులు మృతి చెందారు. శుక్రవారం ఉదయం మహబూబాబాద్‌ పట్టణ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన ఎండీ యాకుబ్‌పాషా (40) పెయింటర్‌ కాగా, మహబూబాబాద్‌ మండలం పాత రెడ్యాల గ్రామానికి చెందిన అంపలి కమలాకరాచారి (33) అసిస్టెంట్‌ పెయింటర్‌. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఇద్దరూ మహబూబాబాద్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ వద్ద పెయింట్‌ వేస్తున్నారు. కాజీపేట నుంచి గూడ్స్‌ రైలు వస్తూండటాన్ని గమనించిన వారు వెంటనే పక్క ట్రాక్‌పైకి వెళ్లారు. అక్కడ మలుపు ఉండటంతో వారు నిల్చొన్న ట్రాక్‌పై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ రావడాన్ని గమనించలేదు. అది ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. యాకుబ్‌పాషాకు భార్య, కుమార్తె, కమలాకరాచారికి భార్య ఉన్నారు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని