కాంగ్రెస్‌, శివసేన.. సావర్కర్‌ వివాదం
close

తాజా వార్తలు

Published : 04/01/2020 00:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంగ్రెస్‌, శివసేన.. సావర్కర్‌ వివాదం

ముంబయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు కోసం సిద్ధాంత విభేదాలను మరిచి చేతులు కలిపి కాంగ్రెస్‌, శివసేనల మధ్య తాజాగా వివాదం రాజుకుంది. హిందుత్వ సిద్ధాంతకర్త వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ.. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తీవ్రంగా మండిపడ్డారు. వారి బుర్రంతా చెత్తతో నిండిపోయిందంటూ కాంగ్రెస్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. అసలేం జరిగిందంటే.. 

మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్‌ అనుబంధ సంస్థ అయిన సేవాదళ్‌ ఓ పుస్తకం పంపిణీ చేసింది. ‘వీర్‌ సావర్కర్‌ కిత్నే వీర్‌?(వీర్‌ సావర్కర్‌ వీరత్వం ఎంత?’) అనే పేరుతో ఉన్న పుస్తకంలో.. సావర్కర్‌, నాథూరాం గాడ్సే మధ్య శారీరక సంబంధం ఉన్నట్లు పేర్కొంది. అండమాన్‌ సెల్యూలార్‌ జైలు నుంచి విడుదలైన తర్వాత సావర్కర్‌ బ్రిటిష్‌ వారి నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపించింది. ఇది కాస్తా తీవ్ర వివాదానికి దారితీసింది.

సేవాదళ్‌ పుస్తకంపై సంజయ్‌ రౌత్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘వీర్‌ సావర్కర్‌ చాలా గొప్ప వ్యక్తి. ఎప్పటికీ గొప్ప వ్యక్తిలాగే ఉంటారు. ఓ వర్గం వారు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి వారి బుర్రలో చెత్త ఉందని అర్థం చేసుకోవచ్చు’ అని కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ రౌత్‌ పరోక్షంగా దుయ్యబట్టారు. 

ఇటీవల కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా సావర్కర్‌పై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అత్యాచార ఘటనలపై తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్న రాహుల్‌.. ‘తన పేరు సావర్కర్‌ కాదని, రాహుల్‌ గాంధీ’ అని చెప్పుకొచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని