ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వామపక్షాల నేతలు
close

తాజా వార్తలు

Published : 08/01/2020 12:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆర్టీసీ బస్సులను అడ్డుకున్న వామపక్షాల నేతలు

విజయవాడ: భారత్‌ బంద్‌ ప్రభావం విజయవాడలో నామమాత్రంగా ఉంది. పండిట్‌ నెహ్రూ బస్‌ స్టేషన్‌ ఎదుట వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు బైఠాయించి ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి అరెస్టు చేశారని సీపీఐ, సీపీఎం నేతలు రామకృష్ణ, బాబూరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశ వ్యాప్తంగా వామపక్షాలు, కార్మిక సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చినట్లు చెప్పారు.

గుంటూరు ఎన్టీఆర్‌ బస్టాండ్‌ వద్ద  వామపక్షాల నాయకులు బస్సులను అడ్డుకున్నారు. కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థి సంఘాలు సమ్మెలో పాల్గొన్నాయి. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట వామపక్షాల ఆధ్వర్యంలో  నిరసన తెలిపారు. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని