close

తాజా వార్తలు

Published : 11/01/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నాకు కాదు.. వాళ్లకి భద్రత ఇవ్వండి

చెన్నై: సీఆర్పీఎఫ్‌ భద్రత తనకు కాదని జేఎన్‌యూ విద్యార్థులకు కల్పించాల్సిందిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రభుత్వాన్ని కోరారు. స్టాలిన్‌కు కల్పిస్తున్న జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతను కేంద్రం ఉపసంహరించిన మరుసటి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గత ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయంలోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులను కర్రలు, రాడ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ముసుగులు ధరించిన వ్యక్తులు జేఎన్‌యూ విద్యార్థులపై దాడి చేసిన విజువల్స్‌ చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు ఆయన తెలిపారు. 

‘గత కొన్నేళ్లుగా నాకు భద్రతగా ఉంటున్న సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మతం పేరిట హింసకు పాల్పడే వారి నుంచి విశ్వవిద్యాలయాలకు, విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు సీఆర్పీఎఫ్‌ జవాన్లను ఉపయోగించాల్సిందిగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అంటూ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. విద్యార్థులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా ఆయన డిమాండ్‌ చేశారు. 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని