మేం బెళగావి ఎందుకు వెళ్లకూడదు: రౌత్‌
close

తాజా వార్తలు

Published : 19/01/2020 00:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మేం బెళగావి ఎందుకు వెళ్లకూడదు: రౌత్‌

ముంబయి: మహారాష్ట్ర శివసేన నాయకుడు సంజయ్‌రౌత్‌ శనివారం కర్ణాటకలోని భాజపా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను బెళగావి పర్యటనకు సిద్ధమవగా ఆంక్షలు విధించడంపై ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... ‘అక్రమంగా అనేకమంది భారత్‌లోకి వస్తున్నారు. కానీ మహారాష్ట్ర నుంచి ఒక్క వ్యక్తి కూడా బెళగావి వెళ్లడం లేదు’ అని ఆరోపించారు. ఇది సరైన పద్ధతి కాదని విమర్శించారు. బెళగావిలో నిర్వహించిన సంప్రదాయ, సాహిత్య కార్యక్రమంలో అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు నేను వెళ్లాల్సింది.. కానీ ఆ జిల్లాకు వెళ్లడాన్ని నిషేధించారు. అక్కడ వివాదం ఉంది కానీ దానికి ఒకరిపై ఒకరు ఆంక్షలు విధించాల్సినంత అవసరం లేదని అన్నారు. సంజయ్‌రౌత్‌ను ఆ జిల్లాకు పర్యటనకు వెళ్లకుండా నిషేధాజ్ఞలు జారీ చేసిన తర్వాతి రోజు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని