close

తాజా వార్తలు

ఖండాంతరాలకు విస్తరించిన అమరావతి ఉద్యమం

అమరావతి: అమరావతి ఉద్యమం ఖండాంతరాలకు విస్తరించింది. రాజధాని రైతుల దయనీయ స్థితిపై ప్రవాసాంధ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతుకుదెరువు కోసం బహ్రెయిన్‌ వెళ్లిన రాష్ట్ర వాసులు అమరావతి సంఘీభావ సభ ఏర్పాటు చేశారు. రాజధానిపై ప్రభుత్వ తీరు, మహిళల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. అమరావతి ఉద్యమంలో మరణించిన రైతులకు సంతాపం తెలిపారు. అలుపెరగని పోరాటం చేస్తున్న అమరావతి ప్రజలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌,సేవ్‌ అమరావతి’ అంటూ నినదించారు. 

అమరావతి నుంచి రాజధాని తరలించొద్దంటూ అమెరికాలోని ప్రవాసాంధ్రులు రోడ్డెక్కారు. ‘అమరావతి సాధిద్దాం..అభివృద్ధివైపు అడుగేద్దాం’ అంటూ శాన్‌ఫ్రాన్సిస్కోలోని తెలుగు ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అమరావతి రైతులు, మహిళలకు మద్దతుగా నినదించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.