close

తాజా వార్తలు

Updated : 30/01/2020 16:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మజ్లిస్‌తో భాజపా ఒప్పందం: ఉత్తమ్‌

హైదరాబాద్‌: మహాత్మాగాంధీ సిద్ధాంతాలే కాంగ్రెస్ సిద్ధాంతమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. ఈ దేశం పరమత సహనంతో ఉండాలని గాంధీ కోరుకున్నారని, కానీ, భాజపా మాత్రం గాంధీ సిద్ధాంతాలను తుంగలో తొక్కి మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి  గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ నేతలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. మజ్లిస్‌ పార్టీతో భాజపా లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. అదేవిధంగా తెరాస సైతం భాజపా, మజ్లిస్‌తో దోస్తీ చేస్తోందని ఆరోపించారు. అందుకే భైంసా ఘటనపై స్పందించలేదన్నారు. ఈ మూడు పార్టీలు గాంధీ సిద్ధాంతాలను పక్కకు పెట్టి మత రాజకీయాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. తెలంగాణ పుర ఎన్నికల్లో ఎన్నికల సంఘం ఘోరంగా విఫలమైందని, ప్రస్తుత పాలన చూస్తే గాంధీ ఆత్మక్షోభిస్తుందని ఉత్తమ్‌ ఆక్షేపించారు.

 

 




Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని