అనురాగ్ ఠాకూర్‌, వర్మపై ఈసీ నిషేధం
close

తాజా వార్తలు

Updated : 30/01/2020 20:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనురాగ్ ఠాకూర్‌, వర్మపై ఈసీ నిషేధం

దిల్లీ: ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, భాజపా ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్ వర్మలను ఎన్నికల ప్రచార తారల జాబితా నుంచి తొలగించాలని ఆదేశించిన ఈసీ తాజాగా వారిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకొంది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ రానున్న 72 గంటలపాటు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండాలని ఆదేశించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్‌ వర్మపై 96 గంటలపాటు నిషేధం విధించింది. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ బహిరంగసభలో అనురాగ్ ఠాకూర్‌ మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. సీఏఏకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న వారిని, ప్రతిపక్షాలను దేశద్రోహులుగా ఆరోపించారు. వారిపై తూటాలు పేల్చండి అంటూ వివాదాస్పదంగా మాట్లాడారు. ఠాకూర్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ కాంగ్రెస్‌ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. దీంతో ఈసీ ఆయనపై చర్యలు తీసుకుంటూ అనురాగ్‌ ఠాకూర్‌ ప్రచారంపై నిషేధం విధించింది. ఇక మరో ఎంపీ పర్వేశ్‌ వర్మ కూడా ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ షహీన్‌బాగ్ ఆందోళనకారులపై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘షహీన్‌బాగ్‌ ఆందోళకారులు ఇళ్లలోకి చొరబడి ఆత్యాచారాలు, హత్యలు చేస్తారు’’ అని ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన ఈసీ ఆయనపై కూడా నిషేధం విధించింది. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని