అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈసీ వార్నింగ్
close

తాజా వార్తలు

Published : 05/02/2020 20:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఈసీ వార్నింగ్

దిల్లీ: ఆమ్‌ అద్మీ పార్టీ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్నికల సంఘం హెచ్చరించింది. జనవరి 13న అరవింద్‌ కేజ్రీవాల్‌ తీస్‌ హజారీ కోర్టు ఆవరణలో న్యాయవాదులతో భేటీ అయ్యారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరిగి అధికారంలోకి వస్తే దిల్లీ హైకోర్టు ప్రాంతంలో కమ్యూనిటీ క్లినిక్‌ను నిర్మిస్తానని వాగ్దానం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత నీరజ్‌ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై అంతర్గత విచారణ చేపట్టిన ఈసీ.. ఎన్నికల నియమావళిని అతిక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు అరవింద్‌ కేజ్రీవాల్‌ను హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఈసీ నోటీసులపై అరవింద్‌ కేజ్రీవాల్‌ వివరణ ఇచ్చారు. న్యాయవాదులతో భేటీ ప్రైవేటు కార్యక్రమమని, ముఖ్యమంత్రి హోదాలో తాను అక్కడికి వెళ్లలేదని తెలిపారు. అంతేకాకుండా తాను అక్కడ వాగ్దానాలేమీ చేయలేదని, గతంలో దిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నే మరోసారి చెప్పానని వివరణ ఇచ్చారు. కానీ, కేజ్రీవాల్‌ వివరణపై ఈసీ పెదవి విరిచింది. వివరణను అంగీకరించడం లేదని స్పష్టం చేసింది.

మరోవైపు ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గర పడుతుండటంతో హస్తినలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భాజపా, అధికార పీఠాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదని ఆప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. దిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు  శనివారం పోలింగ్‌ జరగనుంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని