జగన్‌ సంక్షేమ వ్యతిరేకి: నారా లోకేశ్‌
close

తాజా వార్తలు

Updated : 09/02/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జగన్‌ సంక్షేమ వ్యతిరేకి: నారా లోకేశ్‌

విజయవాడ: ఒక్క అవకాశం ఇచ్చినందుకు జగన్‌ వల్ల రాష్ట్రానికి ఎన్నో కష్టాలు, నష్టాలు, అనర్థాలు వచ్చిపడ్డాయని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో బడుగు, బలహీన వర్గాలకు టెండర్ పెడుతున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారు 7 లక్షల పింఛన్లను ఎత్తివేశారని లోకేశ్‌ ట్విటర్‌ వేదికగా మండిపడ్డారు. మొన్నటి దాక ఒక్క పింఛను కూడా తీసేయలేదని బుకాయించిన వైకాపా ప్రభుత్వం.. రీ వెరిఫికేషన్‌ పేరుతో ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టిందని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల రేషన్‌ కార్డులను ఎత్తివేసి పేదవాడి నోటి వద్ద ముద్ద లాగేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదవాడి పొట్ట కొట్టి రూ.1500 కోట్లు మిగుల్చుకుని ఏం సాధిస్తారని ఆయన నిలదీశారు. ఇంత పెద్ద ఎత్తున పింఛన్‌, రేషన్‌ కార్డులు ఎత్తేసి జగన్‌ సంక్షేమ వ్యతిరేకిగా చరిత్రలో మిగిలిపోతారని లోకేశ్‌ వ్యాఖ్యానించారు.

 



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని